Sovereign Gold Bonds (SGB) పథకం పెట్టుబడిదారులకు ఎంత లాభదాయకమో మరోసారి రుజువైంది. 2017లో రిలీజ్ చేసిన గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ప్రకటించింది. సురక్షితమైన రాబడిని అందించే ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా గోల్డ్ బాండ్స్ అనేది ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ తో ఉంటాయి. అయితే 2017 నవంబర్ 27న జారీ చేయబడిన Sovereign Gold Bonds సిరీస్.. సరిగ్గా ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే.. నవంబర్ 27, 2025న తుది ఫైనల్ రిడెంప్షన్ (Final Redemption)కు వచ్చాయి. ఈ వివరాలను బట్టి ఇవి ఎంత లాభదాయకమో మరో సారి రుజువైంది.
ఎంత లాభం వచ్చిందంటే..
2017లో ఈ బాండ్స్ విలువ ఒక యూనిట్ కు 2,964 ఉండగా.. ఇప్పుడు రిడెంప్షన్ సమయానికి యూనిట్‌కు రూ.12,484 అయ్యింది. అంటే ఎనిమిదేళ్లలో సుమారు ఆరు రెట్లు పెరిగింది. ఈ 2017 సిరీస్‌లో పెట్టుబడి పెట్టిన వారికి వడ్డీ రాబడితో పాటు దాదాపు 329 శాతం అద్భుతమైన రాబడి లభించింది. Sovereign Gold Bonds చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన విజయం అని చెప్పుకోవచ్చు.
గోల్డ్ బాండ్స్ తో ప్రయోజనాలు
- ఫిజికల్ బంగారం (Physical Gold) కొనుగోలుకు ప్రత్యామ్నాయంగా.. పెట్టుబడిదారులకు సురక్షితమైన మార్గాన్ని అందించడానికి RBI ఈ Sovereign Gold Bonds (SGB) పథకాన్ని తీసుకొచ్చింది.
- ఇది భారత ప్రభుత్వం తరపున నిర్వహించే పథకం. ఈ బాండ్లను కలిగి ఉన్నవారికి వార్షికంగా మంచి వడ్డీ రాబడి అందుతుంది.
- భౌతిక బంగారం లాగా దీన్ని నిల్వ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వచ్ఛత గురించి బెంగ లేదు.
- ఇందులో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. మెచ్యూరిటీపై వచ్చే రాబడికి (Capital Gains) పన్ను మినహాయింపు ఉంటుంది.
ఫిజికల్ గోల్డ్ vs గోల్డ్ బాండ్స్
భౌతిక బంగారం లేదా బంగారు ఆభరణాల కొనే సమయంలో కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ పెట్టుబడిదారులు మెచ్యూరిటీపై వచ్చే లాభంపై ఎటువంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు జీఎస్‌టీ(GST) కట్టాలి. అయితే సావరిన్ గోల్డ్ బాండ్స్ పెట్టుబడిలో ఇది ఉండదు. భౌతిక బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నట్టు.. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్‌పై కూడా 'కొలేటరల్'గా ఉపయోగించి రుణం తీసుకోవచ్చు. భౌతిక బంగారంపై ఎటువంటి వడ్డీ లభించదు. గోల్డ్ బాండ్స్‌పై పెట్టుబడిదారుడు సంవత్సరానికి 2.5% వడ్డీని పొందొచ్చు.
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) 1999 ప్రకారం భారతదేశంలో నివసించే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు Sovereign Gold Bonds లో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. అయితే పెరుగుతున్న ఆపరేషనల్ ఖర్చుల దృష్ట్యా ప్రభుత్వం ఈ స్కీమ్ ను నిలిపివేస్తున్నట్టు గతేడాది బడ్జెట్ సమయంలో ప్రకటించింది. మళ్లీ తిరిగి అందుబాటులోకి తెస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications