Gold News: రూ.500 తగ్గింపుకే పసిడి విక్రయం.. కేవలం 5 రోజులే అవకాశం.. త్వరపడండి..
Sovereign Gold Bonds: ప్రస్తుతం పెట్టుబడిదారుల్లో కూడా మార్పు వచ్చింది. అందుకే చాలా మంది భౌతికంగా గోల్డ్ కొనటం కంటే డిజిటల్ గోల్డ్ పెట్టుబడులవైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అలాంటి వారికి తగ్గింపు ధరకే పసిడి అందుబాటులో ఉంచింది రిజర్వు బ్యాంక్.
నేటి నుంచి బంగారు బాండ్లను కొనుగోలు చేయడానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఐదు రోజుల పాటు అంటే డిసెంబర్ 22, 2023 వరకు సేల్ కొనసాగనుంది. ఇందుకోసం ఒక గ్రాము బంగారం బాండ్ ధరను రూ.6,199గా రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి గోల్డ్ బాండ్ల మూడవ సిరీస్. దీనికి ముందు సెప్టెంబరులో రెండవ సిరీస్, ఫిబ్రవరిలో మెుదటి సిరీస్ విక్రయాలు జరిగాయి.

గోల్డ్ బాండ్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేవారికి గ్రాముపై రూ.50 తగ్గింపును రిజర్వు బ్యాంక్ అందుబాటులో ఉంచింది. వారికి గ్రామును రూ.6,149కే పసిడి అందుబాటులో ఉండనుంది. గోల్డ్ బాండ్‌లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల్లోనూ పెట్టుబడి పెట్టే సౌకర్యం ఉంది. ఆఫ్‌లైన్ పద్ధతిలో సమీపంలోని బ్యాంక్ కార్యాలయంలో దరఖాస్తు ద్వారా పొందవచ్చు. అదే విధంగా ఆన్‌లైన్ లో రిజర్వు బ్యాంక్ వెబ్ సైట్ లేదా ఏదైనా బ్యాంక్ ద్వారా కొనుగోలుకు వీలు కల్పించబడింది.
సాధారణ వ్యక్తులు గరిష్ఠంగా 500 గ్రాముల వరకు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించబడగా.. కొన్ని సంస్థలకు గరిష్ఠంగా 20 కేజీల వరకు కొనేందుకు వీలు ఉంది. ప్రభుత్వ బంగారు బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీకి పన్ను విధించదగినది అయినప్పటికీ.. చివర్లో మెచూరిటీ అప్పుడు వచ్చే క్యాపిటల్ గెయిన్స్ పై ఎలాంటి పన్ను విధించబడదు. గతంలో విక్రయించిన బాండ్లు సైతం మంచి రాబడులను ఇన్వెస్టర్లకు అందించాయి. వాస్తవానికి 2017-18 సిరీస్ లో పెట్టుబడులు పెట్టినవారు ఇటీవల 114 శాతం లాభాన్ని అందుకున్నారు. అప్పట్లో గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ.2,890 చొప్పున రిజర్వు బ్యాంక్ విక్రయించింది.


Click it and Unblock the Notifications