Sovereign Gold Bonds: ప్రస్తుతం బంగారంపై చాలా మంది పెట్టుబడులను పెడుతున్నారు. ఈ క్రమంలో కొని దానిని భద్రపరచటం కొంత రిస్క్ తో కూడుకున్నది. అయితే దీనికి చక్కటి పరిష్కారంగా దేశంలో సావరిన్ గోల్డ్ బాండ్లను రిజర్వు బ్యాంక్ మద్ధతుతో అందుబాటులోకి వచ్చాయి.
2023లో సావరిన్ గోల్డ్ బాండ్స్ రెండవ విడత అమ్మకాలు సెప్టెంబర్ 11 నుంచి సెప్టెబర్ 15 వరకు ప్రజల కోసం తెరవబడుతున్నాయి. ఈ ఇష్యూలో పసిడి ప్రియులు పాల్గొని వివిధ పరిమితి కలిగిన బాండ్లను డిజిటల్ రూపంలో పెట్టుబడుల కోసం కొనుగోలు చేయవచ్చు. దీనికోసం ఒక్కో గ్రాము బంగారం ధరను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5,923గా నిర్ణయించింది.

సావరిన్ గోల్డ్ బాండ్ ధర, తేదీ, ఇతర వివరాలకు సంబంధించి జారీ చేసిన ప్రెస్ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 - సిరీస్ II సెప్టెంబర్ 11-15 మధ్య కాలంలో సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఇక్కడ నిర్ణయించిన ధరను ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) అందించిన సెప్టెంబర్ 6-9 స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధరల సగటును గ్రాముకు ఫైనల్ రేటుగా నిర్ణయించింది.
ఆన్ లైన్ దరఖాస్తు ద్వారా డిజిటల్ మోడ్‌లో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ.50 తగ్గింపును అందించాలని భారత ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ నిర్ణయించాయి. వీరికి నిర్థేశించిన రూ.5,923 కంటే రూ.50 తక్కువకు అంటే రూ.5,873కే గ్రామును విక్రయిస్తారు. ఎవరైనా వ్యక్తులు వీటిని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SHCIL), నిర్థేశించిన పోస్టాఫీసులతో పాటు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ కింద నివాసిత భారతీయులు, HUFలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు వారికి కేటాయించిన పరిమితులకు అనుగుణంగా కొనుగోలు చేయవచ్చు. ఇది ఎనిమిది సంవత్సరాల కాలానికి చేసే పెట్టుబడి. అయితే 5వ సంవత్సరం పూర్తైన తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. ఈ పెట్టుబడిపై 2.50 శాతం వడ్డీని కూడా పొందవచ్చు. ఈ పెట్టుబడి వల్ల దీర్ఘకాలంలో క్యాపిటల్ అప్రీసియేషన్ కూడా లభిస్తుంది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications