IPO News: ఐపీవోకి సిద్ధమైన ఆటో దిగ్గజం.. పెట్టుబడికి గెట్ రెడీ ఇన్వెస్టర్స్..
Hyundai Motor: దేశం ఆర్థిక పదంలో వేగంగా ముందుకు సాగుతున్న వేళ గడచిన రెండేళ్లుగా కంపెనీలు వరుసగా తమ ఐపీవోలను లాంచ్ చేస్తున్నాయి. స్టార్టప్స్ నుంచి చిన్న కంపెనీల వరకు ప్రస్తుతం లిస్టింగ్ మంత్రం జపిస్తున్నాయి.
ఈ క్రమంలో సౌత్ కొరియాకు చెందిన ఆటో దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ మోటార్ తన ఐపీవోను ఇండియాలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. దీని ప్రకారం కంపెనీని ఇండియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయవచ్చు. ఇది బహుశా ఇండియన్ స్టాక్ మార్కెట్లలో అతిపెద్ద ఐపీవో కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అంచనాల ప్రకారం ఈ ఏడాది దీపావళి నాటికి కంపెనీ స్టాక్ మార్కెట్లలో జాబితా చేయబడొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే దాదాపు 3 దశాబ్దాల తర్వాత కంపెనీ భారతీయ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ భారతీయ మార్కెట్లపై మంచి ప్రభావాన్ని చూపుతోంది. గత ఏడాది మారుతీ సుజుకీ తర్వాత అత్యధిక ప్యాసింజర్ వాహనాలను విక్రయించడంలో కంపెనీ విజయం సాధించింది. నివేదికల ప్రకారం గత వారం బ్యాంకర్ పిచ్‌లో కంపెనీ వాల్యుయేషన్ 3.3 బిలియన్ డాలర్ల నుంచి 5.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం కంపెనీ విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2023 ఆర్థిక సంవత్సరం ఆదాయాల కంటే 48 రెట్లు అధికం. దక్షిణ కొరియాలో హ్యుందాయ్ మార్కెట్ క్యాప్ 39 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది.
భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో కంపెనీ లిస్టింగ్ దక్షిణ కొరియా 'వాల్యూ అప్' ప్రోగ్రామ్‌లో భాగం కావచ్చు. కంపెనీ 2024 సంవత్సరానికి 4 శాతం నుంచి 5 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే కంపెనీ 12.4 ట్రిలియన్ల పెట్టుబడి ప్రణాళికను రూపొందించింది. పెట్టుబడి బ్యాంకుల లిస్టులో గోల్డ్‌మన్ సాక్స్, సిటీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, JP మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, HSBC మొదలైనవి ఉన్నాయి.


Click it and Unblock the Notifications