IPO News: మార్కెట్‌లో మరోసారి IPO జాతర.. దేశంలోనే అతిపెద్ద IPO.. ఇన్వెస్టర్స్ డబ్బులు రెడీ చేసుకోండి!
Hyundai IPO: దిగ్గజ కంపెనీలు IPOకు వస్తున్న తరుణంలో మార్కెట్లో బజ్ నెలకొనడం సహజం. ఇటీవల LIC, జియో ఫైనాన్షియల్స్ లిస్టింగ్ సమయంలోనూ ఎంతో మంది పెట్టుబడి పెట్టేందుకు ఎగబడ్డారు. తాజాగా దేశంలోనే అతిపెద్ద IPO మార్కెట్లో సందడి చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే అంతర్జాతీయ ఇన్వెస్టర్సు క్యూ కట్టారు.
దేశంలోనే అతిపెద్ద IPOగా లిస్ట్ అయ్యేందుకు దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ మోటార్ సిద్ధమైంది. సుమారు 24 వేల 900 కోట్లను సమీకరించేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు సలహాలు ఇవ్వడానికి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్ JP మోర్గాన్ మరియు సిటీలతో కలిసి పనిచేస్తోంది.

మే లేదా జూన్ మధ్య భారత్ లో నియంత్రణ సంస్థ ఆమోదం కోసం పత్రాలను సమర్పించాలని కంపెనీ భావిస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఇప్పటికే ఇండియన్ వాహన మార్కెట్లో హ్యుండాయ్ 15 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. ఈ ఫండ్ రైజింగ్‌తో భారత్‌లో తన యూనిట్స్ విలువ 30 బిలియన్ డాలర్లకు చేరనుంది. కాగా దక్షిణ కొరియాలోని 47 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌లో దాదాపు సగానికి పైగా ఇక్కడా కలిగి ఉండటం గమనార్హం.
అదనంగా IPO కోసం రాబోయే రోజుల్లో దేశీయ పెట్టుబడి బ్యాంకులను కూడా సంస్థ నియమించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది హ్యూండాయ్ గ్లోబల్ అమ్మకాల్లో 13 శాతం వాటా ఇండియాదే కావడంతో సేకరించిన మూలధనాన్ని కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించాలని యోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
IPOలకు భారత్ ఆకర్షణీయమైన మార్కెట్‌గా మారింది. గత సంవత్సరం దాదాపు 27 బిలియన్ డాలర్ల విలువైన IPOలు మరియు ఫాలో-ఆన్ షేర్ అమ్మకాలు జరిగాయి. మూడు దశాబ్దాలలో మొదటిసారిగా హాంకాంగ్ ను ఇండియన్ మార్కెట్స్ అధిగమించాయి. ప్రస్తుతం న్యూయార్క్ స్టాక్
ఎక్స్ఛేంజ్ (US), నాస్డాక్ (US), షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ (చైనా), Euronext, జపాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు షెన్‌జెన్ స్టాక్ ఎక్స్ఛేంజ్(చైనా) లు బారత్ లోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications