Multibagger stock: వరల్డ్ రికార్డుతో వండర్ సృష్టించిన EV స్టాక్.. ఏడాదిలో 919 శాతం రిటర్న్స్
Multibagger stock: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. సంప్రదాయ డీజిల్, పెట్రోల్ వాహనాల నుంచి ప్రజలు క్రమేపీ దూరంగా జరుగుతున్నారు. ఈ సమయంలో బ్యాటరీలు సహా సంబంధింత ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆయా కంపెనీలు మంచి లాభాలతో కొనసాగుతున్నాయి.
దక్షిణ కొరియాకు చెందిన బ్యాటరీ మెటీరియల్ తయారీదారు ఎకోప్రో.. భారీ వృద్ధి నమోదుచేసింది. ఏడాది కాలంగా చూస్తే ఈ కంపెనీ షేర్లు ఆకాశమే హద్దుగా చెలరేగాయి. సంస్థ ఏకంగా 919 శాతం వృద్ధి కనబరిచింది. కనీసం 10 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ఏ కంపెనీకైనా ఇదే అత్యధిక లాభం కావడం విశేషం.

అయితే ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎకోప్రో వ్యవస్తాపకులు, CEO లీ డాంగ్ చే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఓ పక్క కంపెనీ యజమాని నిర్బంధంలో ఉండగా.. సంస్థ మాత్రం లాభాల సునామీ సృష్టిస్తోంది. ఎకోప్రో స్టాక్ ప్రపంచంలో అత్తుత్తమ పనితీరు కనబరుస్తూ ఇన్వెస్టర్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఎకోప్రో ఇంత భారీ వృద్ధి కనబరచడంతో బిలియనీర్ డాంగ్ చే సంపద కూడా అదే రేంజ్‌లో ఎగసిపడింది. ఏకంగా ఆయన ఆస్తి విలువ 919 శాతం పెరగడంతో అపార లాభాలు సొంతం చేసుకున్నారు. దేశీయ షేర్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే కొరియా రిటైల్ ఇన్వెస్టర్లు ఎకోప్రో వృద్ధికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణంలో ఉపయోగించే పదార్థాలను ఎకోప్రో ఉత్పత్తి చేస్తుంది. శామ్‌సంగ్ SDI, SK ఆన్ కో సహా పలు క్లయింట్ల కోసం లిథియం-అయాన్ బ్యాటరీల్లో ఉపయోగించే క్యాథోడ్స్ ను అందిస్తోంది. తన అనుబంధ ఎకోప్రో BM ద్వారా వీటిని సమకూరుస్తోంది. పునర్వినియోగ బ్యాటరీల మార్కెట్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుతుంది అనడానికి ఇదొక ఉదాహరణగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications