ఎప్పుడైనా మనకు అత్యవసర సమయంలో డబ్బు కావాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం తాకట్టు పెట్టడం. బంగారం ఒక్క ఆభరణంగా మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు ఆర్థిక సహాయానికి కూడా అది బాగా ఉపయోగపడుతుంది. అయితే బ్యాంకులు మాత్రం బంగారంలో 60 శాతం మాత్రమే రుణాలుగా ఇస్తాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, సాధారణ ప్రజలు అందరికీ ఉపశమనం కలిగేలా ఎస్‌ఐబీ గోల్డ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక స్కీం ప్రారంభించింది.
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవల సంస్థలు బంగారం తాకట్టుపై తక్కువ శాతం మాత్రమే రుణం మంజూరు చేస్తూ వచ్చాయి. సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు మాత్రమే రుణాన్ని ఇస్తూ వస్తున్నాయి.అయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ తాజాగా బంగారం విలువలో 90 శాతం వరకు రుణం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గోల్డ్ లోన్ మార్కెట్లో అతి పెద్ద మార్పు తీసుకొస్తుందని Gold నిపుణులు భావిస్తున్నారు.

ఈ స్కీం ప్రత్యేకత ఏమిటంటే.. ఖాతాదారు తన బంగారం తాకట్టుపెట్టిన వెంటనే రుణం మంజూరు అవుతుంది. ఎప్పుడైనా ముందుగానే లేదా విడతల వారీగా తిరిగి చెల్లించుకునే అవకాశం కూడా ఉంది. మూడేళ్ల కాలపరిమితితో ఈ రుణం అందుబాటులో ఉండగా.. రూ. 25 వేల నుంచి రూ. 25 లక్షల వరకు రుణం పొందవచ్చు. చిన్న స్థాయి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, నాన్-ఎంఎస్‌ఎంఈలు, వ్యక్తిగత వెంచర్లు మొదలైన విభాగాలను లక్ష్యంగా చేసుకొని ఈ స్కీం సౌత్ ఇండియన్ బ్యాంక్ రూపొందించింది.
సాధారణంగా బ్యాంకులు గోల్డ్ లోన్లలో మరిన్ని ప్రాసెసింగ్ ఛార్జీలు, అదనపు ఖర్చులు వేస్తూ ఉంటాయి. కానీ సౌత్ ఇండియన్ బ్యాంక్ మాత్రం ఎలాంటి ఛార్జీలు లేకుండా, పారదర్శకంగా రుణాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ రూపంలోనే పూర్తవుతుందని తెలిపింది. అంటే కస్టమర్‌కి రుణం పొందడంలో సమయం వృథా కాకుండా సులభతరం అవుతుంది.
ఈ పథకం ప్రధానంగా చిన్న వ్యాపారులకే ఊరట లభిస్తుంది. ఎందుకంటే వారికీ తక్షణ నిధులు అవసరమయ్యే సందర్భాలు తరచుగా వస్తాయి. కూరగాయల వ్యాపారులు, చిన్న షాప్ యజమానులు, స్వయం ఉపాధి ఆధారంగా పనిచేసేవారు రోజువారీ వ్యాపార ఖర్చుల కోసం తక్షణ నిధులు పొందడంలో ఇబ్బందులు పడకుండా ఉంటారు. అటువంటి వారికి ఈ గోల్డ్ ఎక్స్‌ప్రెస్ స్కీం నిజమైన వరంగా మారబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచీలలో ఈ స్కీం అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది.బంగారం తాకట్టుపై రుణం తీసుకోవాలనుకునే వారికి సౌత్ ఇండియన్ బ్యాంక్ కొత్త స్కీం ఒక అధ్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications