ఎప్పటి నుంచో ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు నిజంగా ఆచరణలోకి వస్తుంది. ఈ రెండు మెట్రో నగరాల మధ్య ఇప్పుడున్న రైలు ప్రయాణం దాదాపు 19 గంటలు పడుతుంటే, త్వరలో అది కేవలం 2 గంటల్లో పూర్తవ్వబోతోంది!
ప్రస్తుతం (SCR) అధికారులు ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించారు. మొత్తం 626 కి.మీ పొడవున్న ఈ హై-స్పీడ్ రైలు లైన్ కోసం రైల్వే కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేస్తోంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత, SCR డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పంపనుంది. ఆ తర్వాత ఆమోదం లభిస్తే, కన్‌స్ట్రక్షన్ టెండర్లు జారీ అవుతాయి.

ఈ ప్రాజెక్ట్ మొత్తం దూరం సుమారు 626 కి.మీ ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరు మరియు హైదరాబాద్ వరకు రైలు ప్రయాణం చేస్తే దాదాపు 19 గంటల సమయం పడుతోంది. కానీ ఈ కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైతే, అదే ప్రయాణం కేవలం 2 గంటల్లో పూర్తవుతుంది. ఈ రైలు లైన్‌ని గంటకు 350 కి.మీ డిజైన్ స్పీడ్‌తో రూపొందిస్తున్నారు, అయితే సాధారణంగా ఇది గంటకు 320 కి.మీ ఆపరేషనల్ స్పీడ్‌తో నడుస్తుంది.
ఇంత వేగంతో నడిచే ఈ ట్రైన్, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ లైన్ తరహాలోనే డిజైన్ అవుతోంది. అంటే మన దక్షిణ భారత ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లబోతోందని చెప్పొచ్చు! ఇప్పటి వరకు ఒక నగరం నుంచి ఇంకో నగరానికి రోజంతా కేటాయించాల్సి వచ్చేది, కానీ ఈ ట్రైన్‌తో కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు ఇదే దాని స్పీడ్ మ్యాజిక్!
భూసేకరణే పెద్ద సవాల్
ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూసేకరణ పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది. SCR చీఫ్ PRO ఏ. శ్రీధర్ మాట్లాడుతూ, సర్వే టీమ్ రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించగా, ఆంధ్రప్రదేశ్ సీఎం దక్షిణ భారత ప్రధాన నగరాలను కలిపే మరో పెద్ద హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ ప్రణాళికను ప్రస్తావించారు. అంటే ఇది కేవలం ఒక లైన్ ప్రాజెక్ట్ కాదు భవిష్యత్తులో మొత్తం దక్షిణ భారత రైలు ప్రయాణాన్ని మార్చే మొదటి అడుగు కావొచ్చు.
ఈ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం సూచించబడిన ప్రధాన స్టేషన్లలో హైదరాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు ఉన్నాయి. ఇవి రూట్ మధ్యలో ప్రధాన నగరాలు కావడంతో, ఇక్కడ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి ఇంకా ప్రాథమిక దశలో ఉన్న ప్రతిపాదనలు మాత్రమే సర్వే పూర్తయిన తర్వాత తుది డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)లో ఖచ్చితమైన స్టేషన్లు నిర్ణయించ బడతాయి. మొత్తం మీద ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభమైతే, ఈ నగరాల మధ్య ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యంగా మారనుంది.
ఈ లైన్ డిజైన్ స్పీడ్ గంటకు 350 కి.మీ, ఆపరేషనల్ స్పీడ్ గంటకు 320 కి.మీగా ప్లాన్ చేస్తున్నారు. బస్సులు, విమానాలు రెండూ మినహాయించి, కేవలం రెండు గంటల్లో బెంగళూరు-హైదరాబాద్ చేరే అవకాశం రాబోతోంది.


Click it and Unblock the Notifications