దేశానికి వెన్నెముకలా దక్షిణాది రాష్ట్రాలు, రియల్ ఎస్టేట్ రంగమంతా ఈ మూడు నగరాలదే
దేశంలో రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలు కారణమవుతున్నాయి. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ రియాల్టీల దూసుకుపోతూ కీలకంగా మారుతున్నాయని CBRE, CII సంయుక్త నివేదిక తెలిపింది. షేపింగ్ ది ఫ్యూచర్: ది రియల్ ఎస్టేట్ విజన్ 2030 ఫర్ కర్ణాటక అండ్ బియాండ్ అనే నివేదిక CII కర్ణాటక రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2025 లో తాజాగా విడుదలయ్యింది.
ఈ నివేదిక ప్రకారం, ఈ మూడు నగరాలు.. ప్రత్యేక రంగాలలో బలమైన పెట్టబడులతో పాటు దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అవి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, బలమైన డిమాండ్, అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడులు వంటి అంశాల ద్వారా గొప్పగా ఎదుగుతున్నాయి.
కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ప్రస్తుతం దక్షిణ రియల్ ఎస్టేట్ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే.. కర్ణాటక 2032 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరుతో పాటు ఇతర నగరాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. ఇక తమిళనాడు చూసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, డేటా సెంటర్ల వృద్ధిలో ఆధిక్యత చూపుతుంది. తెలంగాణ బయోటెక్, ఏరోస్పేస్ రంగాలపై మరియు ప్రాంతీయ కనెక్టివిటీపై ఫోకస్ పెడుతోంది.

టైర్-II నగరాల సామర్థ్యాన్ని కూడా హైలైట్ చేస్తూ, నివేదికలో మైసూరు, కోయంబత్తూర్, విశాఖపట్నం, కొచ్చి వంటి నగరాలలో పెరుగుతున్న మౌలిక సదుపాయాలు మరియు ప్రభుత్వ విధానాల మద్దతుతో కొత్త అవకాశాలు రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొంది. ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో IT/ITeS రంగం ఆధిపత్యం కొనసాగుతోంది. అంతర్జాతీయ, దేశీయ కంపెనీల డిమాండ్‌తో కార్యాలయ స్పేస్ అభివృద్ధి వేగంగా సాగుతోంది.
అంతేకాకుండా లైఫ్ సైన్సెస్, బయోటెక్, ఆవిష్కరణ కేంద్రాలు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో మరింత బలపడుతున్నాయి. ఇక చెన్నై తన పారిశ్రామిక దృక్పథంతో ఎలక్ట్రానిక్స్, EV తయారీ కేంద్రంగా ఎదుగుతోంది. అదే సమయంలో పర్యాటకం, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాలు పట్టణ సంపద పెరుగుదల, మెరుగైన కనెక్టివిటీతో శరవేగంగా విస్తరిస్తున్నాయి.
CBRE ఇండియా అధికారులు చెబుతున్న ప్రకారం.. దక్షిణ భారతదేశం రియల్ ఎస్టేట్‌లో వైవిధ్యత సాధిస్తోంది. గ్రేడ్ A కార్యాలయాల నుంచి డేటా సెంటర్లు, మౌలిక రంగాల వరకు. విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ ఫండ్స్.. ఈ అవకాశాలను వాణిజ్యంగా మారుస్తూ, రంగ అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications