AP News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మచిలీపట్నం- కర్నూలు మధ్య ట్రై వీక్లి ఎక్స్ ప్రెస్..

రైల్వే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత పెంచేందుకు దక్షిణ తీర రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో మచిలీపట్నం, కర్నూలు సిటీ మధ్య కొత్త ట్రై-వీక్లీ అంటే వారానికి మూడు రోజులు ఎక్స్‌ప్రెస్ రైలు నడపనుంది. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. 499 కిలోమీటర్ల మేర సాగే ఈ రైలు విజయవాడ మీదుగా ప్రయాణం కొనసాగిస్తోంది. ఈ ట్రైన్ మచిలీపట్నంలో సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం 04:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:45 గంటలకు కర్నూలు సిటీ చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో మంగళ, గురు, ఆదివారాల్లో ఉదయం 09:30 గంటలకు కర్నూలు సిటీలో నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 21:35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుందని దక్షిణ తీర రైల్వే ప్రకటించింది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల తదితర ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వివరించారు. వచ్చే దసరా, దీపావళి సందర్భంగా కూడా ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నాయి. ఏపీ మీదుగా అస్సాంలోని తిన్ సుకియా నుంచి బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ ట్రైన్ మొత్తం 12 ట్రిప్పులు నడుస్తుంది. మొదటి రైలు అక్టోబర్ 8వ తేదీన బయల్దేరుతుంది. నవంబర్ 16వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తుంది. పండగ సీజన్, ప్రయాణికుల నుంచి లభించే ఆదరణను దృష్టిలో పెట్టుకుని దీన్ని పొడిగించే అవకాశం ఉంది.

Train

ఈ రైలుఅక్టోబర్ 8, 15, 22, 29, నవంబర్ 5, 12 తేదీల్లో ప్రతి గురువారం సాయంత్రం 6:45 నిమిషాలకు తిన్ సుకియా నుంచి బయలుదేరే నంబర్ 05952 ప్రత్యేక రైలు నాలుగో రోజు ఉదయం 9: 30 నిమిషాలకు ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 12, 19, 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో ప్రతి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12:05 నిమిషాలకు బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 05951 ప్రత్యేక రైలు మూడో రోజు సాయంత్రం 4: 25 నిమిషాలకు తిన్ సుకియాకు చేరుకుంటుంది. బెంగళూరు, విశాఖపట్నం మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

రైలు నంబర్ 08583, అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు SMVT బెంగళూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:50 గంటలకు SMVT బెంగళూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, బంగారపేట, కేఆర్ పురం మీదుగా నడుస్తాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+