Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు..!
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండగా సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచి బారౌని మధ్య నడపనున్నారు. రైలు నంబర్ 07588 రైలు 2026 నవంబర్ 8న, 2026 నవంబర్ 15న చర్లపల్లి నుంచి బారౌని వెళ్తోంది. ఇక 07589 నంబర్ గలు రైలు 2026 నవంబర్ 10, నవంబర్ 17న బారౌని నుంచి చర్లపల్లికి వస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుంచి వెళ్లేటప్పుడు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద పోర్ట్, వార్ద, బకోరా, దుర్గ్, రాయ్ పూర్, బిలాస్ పూర్, జర్స్గూడ, రుర్కేల, నాగన్, హటియా, రాంచి, మౌరి, బోకరో స్టీల్ సిటీ, చంద్రపూర, కాట్రసర్గ్, ప్రధాన్ కుంట, బర్గర్, చింతరాంజన్, మాదాపూర్, జాసిద్, జాజా, క్యౌల్ స్టేషన్లలో అగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. అలాగే చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. నవంబర్ 24న చర్లపల్లి నుంచి నిజాముద్దీన్ కు ప్రత్యేక రైలు నడపనున్నారు. అలాగే నవంబర్ 24, డిసెంబర్ 1న చర్లపల్లి నుంచి ప్రయాగ్ రాజ్ ప్రత్యేక రైళ్ల నడుపుతారు. డిసెంబర్ 2న చర్లపల్లి నుంచి పట్నా ప్రత్యేక రైలు ఉంటుంది. నవంబర్ 29న చర్లపల్లి ధన్ పూర్ ప్రత్యేక రైలు నడవనుంది. నవంబర్ 18, 25న జల్నా నుంచి చపర ఒక ప్రత్యేక రైలు నడవనుంది. నవంబర్ 26న చర్లపల్లి సారం మధ్య ప్రత్యేక రైలు ఉంది.

సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నవంబర్ 5 నుంచి 10 వరకు ప్రత్యేక రైలు నడవనుంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు నవంబర్ 4 నుంచి 10 వరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మురసు తుఫాన్ సందర్భంగా కొన్ని రైళ్లు కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నవంబర్ 4న గూడురు సికింద్రాబాద్ రైలు రద్దు అయింది. కొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. ఇక ప్రయాణికుల రద్దీని బట్టి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇప్పటికే దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు పూర్తికావొచ్చాయి. డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications