Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పండక్కి ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
వచ్చే పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్, హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07021 నంబర్ గల రైలు తేదీ 19.10.2026 నుంచి 30.11.2026 వరకు మొత్తం 7 సర్వీసుల నడపనున్నారు. ఈ ట్రైన్ చర్లపల్లి నుంచి అజ్రత్ నిజాముద్దీన్ కు వెళ్తోంది. 07022 నబంర్ గల ట్రైన్ 21.10.2026 నుంచి 02.12.2026 వరకు మొత్తం 7 సర్వీసులు నడపనున్నారు. ఈ ట్రైన్ అజ్రత్ నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి వస్తుంది. 07023 నంబర్ గల రైలు 20.10.2026 నుంచి 24.11.2026 వరకు మొత్తం 6 సర్వీసులు నడవనున్నాయి. ఈ ట్రైన్ చర్లపల్లి నుంచి అజ్రత్ నిజాముద్దీన్ కు వెళ్తుంది.
07024 నంబర్ గల రైలు 22.10.2026 నుంచి 26.11.2026 వరకు మొత్తం 6 సర్వీసులు నడపనున్నారు. ఈ ట్రైన్ అజ్రత్ నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి వస్తుంది. 07041 నంబర్ గల రైలు చర్లపల్లి నుంచి ససారం మధ్య నడవనుంది. ఈ ట్రైన్ 08.10.2026 నుంచి 26.11.2026 వరకు మొత్తం 8 సర్వీసులు నడపనున్నారు. 07042 నంబర్ గల రైలు ససారం నుంచి చర్లపల్లికి నడపనున్నారు. ఈ రైలు 09.10.2026 వరకు 27.11.2026 వరకు మొత్తం 8 సర్వీసులు నడపనున్నారు. చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ ప్రత్యేక రైళ్లు రెండు దిశలలోనూ కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్‌షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ధోల్‌పూర్, ఆగ్రా కంటోన్మెంట్, మథుర, కోసి కలాన్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

చర్లపల్లి - ససారం - చర్లపల్లి ప్రత్యేక రైళ్లు రెండు దిశలలోనూ కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్‌షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, మదన్ మహల్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భభువా రోడ్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 42 ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఎన్ని గంటలకు బయల్దేరుతాయి. ఈ రైళ్లకు సంబంధించి టికెట్ల రిజర్వేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దక్షిణ మధ్య ఈ మార్గాల్లోనే కాకుండా మిగతా మార్గాల్లో కూడా రైళ్లను నడుపుతోంది. నందేడ్ నుంచి అజ్రత్ నిజాముద్దీన్ కూడా ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు పూర్ణా, పర్భాని, సెల్లు, పార్టూర్, జల్నా, ఛత్రపతి సంభాజీనగర్, మన్మాడ్, జల్గావ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సీ, భోపాల్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
