Special Trian: తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైలు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే..!

కలియుగ వైకుంఠం తిరుమలకు నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తారు. తిరుపతికి రైళ్లలో వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఒక్కోసారి తిరుపతి వెళ్లేందుకు టికెట్లు దొరకవు. అయితే తిరుమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచిై తిరుపతికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇది వన్ వే స్పెషల్ ట్రైన్ అని వెల్లడించింది. 07099 నంబర్ గల రైలు నవంబర్ 24న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది.

మరుసాటి రోజు అంటే నవంబర్ 25న తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు మంగళవారం సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. తిరుమలకు బుధవారం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు చేరుకుంటుంది. అయితే ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఈ రైలు లింగంపల్లి, వికారాబాద్, రాయిచూర్, అధోని, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, ములకలచెరువు, మదనపల్లె రోడ్, కల్కికిరి, పీలెరు, పాకాల జంక్షన్ గుండా తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో చైర్ కార్, జనరల్ సెకండ్ క్లాస్ కోచులు ఉన్నాయి. తిరుపతికి వెళ్లే వారు వెంటనే బుక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

Special Train

తెలంగాణలోని పలు జిల్లాల నుంచి తిరుపతి రెగ్యులర్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి కృష్ణా ఎక్స్ ప్రెస్, నిజామాబాద్ నుంచి రాయలసీమ ట్రైన్, కరీంనగర్ తిరుపతి వీక్లీ రెండు సార్లు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నడుస్తోంది. నారాయణాద్రి, శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ కూడా తిరుపతికి రెగ్యులర్ గా ప్రయాణం చేస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా నడిస్తోంది. ఈ రైలు ఇది ఉదయం 6.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మధ్యాహ్నం 02.35 గంటలకు తిరుపతికి చేరుతుంది.

8 గంటల 25 నిమిషాల్లోనే ఇది తిరుపతికి నడుస్తుంది. సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వారంలో మూడు రోజులు కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్తున్నాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా తిరుపతికి రైళ్లు ఉన్నాయి. విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నుంచి తిరుపతికి రైళ్లు నడుస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+