Special Trains: గుడ్ న్యూస్.. పలు నగరాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు నడిపింది. ఇప్పుడు పలు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆ రూట్లో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశ నగరాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు తెలంగాణ, ఏపీ గుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లనున్నాయ. పోదనూర్ నుంచి బరౌనీ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బెంగళూరు నుంచి దానాపూర్ కూడా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 06530 నెంబర్ గల ఈ ప్రత్యేక రైలు ఈ నెల 20న శుక్రవారం రాత్రి 11:35 గంటలకు SMVT బెంగళూరు స్టేషన్ నుంచి బయలుదేరి, సోమవారం తెల్లవారుజామున 04:00 గంటలకు దానాపూర్ చేరుకోనుంది.
ఈ రైలు యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, రాయచూర్, కృష్ణా, వికారాబాద్, సికింద్రాబాద్, కాజీపేట, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, నర్సింగ్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకీ, మీర్జాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు కూడా ప్రత్యేక రైలు నడవనుంది. 04006 నెంబర్ గల ఈ ప్రత్యేక ట్రైన్ ఈ నెల 18న బుధవారం మధ్యాహ్నం 13:20 గంటలకు న్యూఢిల్లీలో బయలుదేరి, శుక్రవారం ఉదయం 09:50 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది.

అలాగే 04005 నెంబర్ గల మరో ట్రైన్ 24న మధ్యాహ్నం 15:45 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి, గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు గుంతకల్లు, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. మథుర, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సీ, మన్మాడ్, షోలాపూర్, రాయచూర్, యలహంక స్టేషన్‌లలో ఆగనుంది. ఈ రైలులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే పైన పేర్కొన్న నాలుగు ప్రత్యేక రైళ్లు కేవలం ఒక్కో సర్వీసు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
టికిట్స్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. 06139 నెంబర్ గల స్పెషల్ ట్రైన్ పోదనూర్, బరౌనీ మధ్య రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 18న బుధవారం ఉదయం 06:15 గంటలకు పోదనూర్ నుంచి బయలుదేరి, శుక్రవారం మధ్యాహ్నం 1:30కు బరౌనీ చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్. తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కాట్పాడి, పెరంబూర్, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకీ, దానాపూర్, హాజీపూర్ స్టేషన్‌లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications