Special Train: గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు..
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేల మంది తిరుపతికి వెళ్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలోని ప్రజలు ఎక్కువగా తిరుపతి వెళ్తుంటారు. ఇందులో ఎక్కువ మంది రైళ్లలోనే తిరుపతికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే రైల్వే తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైలు నడపడానికి నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు ప్రత్యేక రైలు నడుపుతుంది. ముఖ్యంగా ఏపీ తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ప్రత్యేక రైలు అందుబాటులోకి తీసుకురానున్నారు. సికింద్రాబాద్, తిరుపతి మార్గంలో ప్రయాణికుల తాకిడిని అధికంగా ఉండటంతో అధికారులు ఈ ప్రత్యేక రైలును నడిపిస్తున్నామని ప్రకటించారు.
ప్రత్యేక రైలు జూలై 26న తిరుపతిలో ప్రారంభం అవుతుంది. ఇది సింగిల్ ట్రిప్ ఎక్స్ ప్రెస్ అని రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి చర్లపల్లికి వెళ్లి మళ్లీ తిరిగి రావడంతో దీని ప్రయాణం ముగుస్తుందని అధికారులు ప్రకటించారు. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ కు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ రైలు ఎక్కొచ్చని చెబుతున్నారు.ఈ నెల 26వ తేదీన గురువారం రాత్రి 8 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07417 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9:15 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి నంబర్ 07418 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో ఏసీ- 2 టయర్, ఏసీ- 3 టయర్, స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ బోగీలు ఈ ఎక్స్ ప్రెస్ కు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయినట్లు అధికారులు తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications