ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సేవల్లో అంతరాయం కలిగింది. ఫేస్‌బుక్‌తో పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు కూడా స్తంభించాయి. దీంతో కస్టమర్లు కొద్ది గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఏడు గంటల తర్వాత మంగళవారం వేకువజామున నాలుగు గంటల నుండి వాట్సాప్ సేవలను పునరుద్ధరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవల అంతరాయంపై అధినేత మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. 'అంతరాయానికి చింతిస్తున్నాం' అని మార్క్ పేర్కొన్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్‌లైన్‌లో ఇప్పుడు పునరుద్ధరించామని కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

మాపై ఎంత ఆధారపడతారో తెలుసు.. సారీ
'ఈ రోజు అంతరాయం కలిగినందుకు క్షమించండి. మీకు సంబంధించిన వారితో సన్నిహితంగా ఉండేందుకు మా సేవల పైన ఎంతగా ఆధారపడతారో నాకు తెలుసు' అని కూడా మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాలు కూడా అంతరాయంపై స్పందించాయి.
'ప్రపంచవ్యాప్తంగా మాపై ఆధారపడిన కోట్లాదిమంది ప్రజలకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి క్షమాపణలు చెబుతున్నాం. నిలిచిన మా సేవలను పునరుద్ధరించడంతో తిరిగి ఆన్‌లైన్‌కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మాకు సహకరించినందుకు థ్యాంక్స్' అని ఫేస్‌బుక్ ట్వీట్ చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఆరేడు గంటల తర్వాత ఆన్‌లైన్‌లోకి వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని అంతరాయాన్ని ఇప్పుడు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

ఏం జరిగిందో తెలియక..
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఫేస్‌బుక్ ఇన్‌స్టా సేవలు నిలిచిపోవడంతో కోట్లాదిమంది యూజర్లు షాకయ్యారు. ఈ వార్త సంచలనంగా మారింది. వీటిపై ఆధారపడిన కోట్లాదిమందికి ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. పోస్టులు కూడా పెట్టారు. ప్రత్యామ్నాయ సామాజిక వర్గాల్లో వర్క్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో ఫేస్‌బుక్ యూజర్లు 41 కోట్ల మందికి పైగా, వాట్సాప్ యూజర్లు 53 కోట్ల మందికి పైగా, ఇన్‌స్టా యూజర్లు 21 కోట్ల మందికి పైగా ఉన్నారు.

140 బిలియన్ డాలర్ల నుండి 121 డాలర్లకు పతనం
సోషల్ మీడియా అంతరాయం కారణంగా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కు ఆర్థికంగా భారీ నష్టం జరిగింది. కొద్ది గంటల్లోనే 6 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కరిగిపోయాయి. దీంతో ప్రపంచ కుబేరుల జాబితా నుండి ఆయన స్థానం దిగజారింది. అంతేకాదు, సోషల్ మీడియా దగ్గజం ఫేస్‌బుక్ స్టాక్స్ సోమవారం 4.9 శాతం మేర క్షీణించాయి. మిడ్ సెప్టెంబర్ నుండి ఈ స్టాక్ 15 శాతం నష్టపోయింది. స్టాక్ నష్టాలతో జుకర్‌బర్గ్ ఆస్తి 6 బిలియన్ డాలర్లకు పైగా కరిగిపోయి 121.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దీంతో జుకర్‌బర్గ్ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుండి అయిదో స్థానానికి దిగజారాడు. ఎలాన్ మాస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్, బిల్ గేట్స్ తర్వాత నిలిచాడు. కొద్ది వారాల్లోనే ఆయన ఆస్తులు 140 బిలియన్ డాలర్ల నుండి దాదాపు 20 డాలర్ల మేర పడిపోయింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications