For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక రేషన్ దుకాణాల్లో గ్యాస్ సిలిండర్లు, కానీ వాటికే పరిమితం

|

ప్రస్తుతం మనకు గ్యాస్ కావాలంటే చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు అందిస్తాయి. 5 కిలోల సిలిండర్, 14.2 కిలోల సిలిండర్, కమర్షియల్ సిలిండర్స్ కావాలంటే ముందుగా బుక్ చేసుకుంటే ఈ సంస్థలు అందిస్తాయి. లేదంటే బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సిందే. ఇక్కడ చాలా ఎక్కువ ధర ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి కొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. ఇది వినియోగదారులకు ఊరట కలిగించే అంశమే. అయితే ఈ ఊరట అన్ని సిలిండర్లు కాదు, 5 కిలోల సిలిండర్‌కు మాత్రమే.

కేంద్రం సూచన ప్రాయ నిర్ణయం మేరకు గ్యాస్ సిలిండర్ల కోసం సంబంధిత కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డెలివరీ కోసం వేచి చూడవలసిన అవసరం లేదు. ఇక చౌక దుకాణాల వద్ద కూడా సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది కూడా అందరికి కాదు. సామాన్యులకు మాత్రమే. ఇప్పటికే సిలిండర్లు ఇళ్ళ వద్దకు వస్తున్నాయి. అయితే దీనిని మరింత సరళీకృతం చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నది.

 Soon, You may get small cooking gas cylinders Through Ration Shops

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు మరింత అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో కొత్త సేవలను తీసుకు వచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రజలకు సౌలభ్యం కలగనుంది. ఇందులో భాగంగా గ్యాస్ సిలిండర్లు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలు, ఆయిల్ కంపెనీలతో చర్చలు జరుపుతోందట. సింగిల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి, వలస కార్మికులకు ఇది ప్రయోజనకరం.

English summary

ఇక రేషన్ దుకాణాల్లో గ్యాస్ సిలిండర్లు, కానీ వాటికే పరిమితం | Soon, You may get small cooking gas cylinders Through Ration Shops

Small cooking gas cylinders could soon be available for retail purchase at your nearby ration shop, as the Centre is coordinating with States and oil companies on the plan, Food Secretary Sudhanshu Pandey.
Story first published: Monday, November 1, 2021, 18:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X