అన్నదాతలను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి సంవత్సరం రైతులకు రూ.6 వేలను బ్యాంక్ అకౌంట్లో జమా చేస్తారు. మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమా చేస్తారు.

ఈకేవైసీ ఉంటనే
ఇప్పటికే 11 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమా అయింది. త్వరలో 12 విడత డబ్బులు వేయనున్నారు. 12 విడత డబ్బులు మరో రెండు వారాల్లో రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే 12 విడత డబ్బులు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 30
ఈకేవైసీ చేసుకోవడానిక సెప్టెంబర్ 30 వరకు గడవు పొడగించింది. ఆ లోపు ఈకేవైసీ చేసుకున్న వారికే 12 విడత డబ్బులు ఖాతాల్లో జమా కానున్నాయి. ఈకేవైసీ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింక్ కాకుంటే వెంటనే మీ దగ్గరలోని మీ సేవ సెంటర్ కు వెళ్లి మీ ఫోన్ నెంబర్ ను ఆధార్ లింకే చేసుకోవాలి.

ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే..
Step 1: ముందుగా అధికారిక వెబ్ సైట్ pmkisan.nic.in కి లాగిన్ అవ్వాలి.
Step 2: అందులో Farmers Corner కింద ఉన్న eKYC ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
Step 3: OTP ఆధారిత eKYC కోసం మీ ఆధార్ నంబర్ అందించండి.
Step 4: ఆ తరువాత సెర్చ్ ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: ఆ తరువాత ఆధార్ లింక్ చేయబడిన మెుబైల్ నంబర్ ఎంటర్ చేసి.. Get OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 6: ఆ తరువాత మీ మెుబైల్ కు వచ్చిన ఓటీపీ నంబర్ ఎంటర్ చేయండి.
Step 7: అందించిన వివరాలు పూర్తిగా వెరిఫికేషన్ అయ్యాక eKYC ప్రక్రియ పూర్తవుతుంది.

టోల్ ఫ్రీ నెంబర్ 155261
కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడంలో ఏదైనా సమస్య ఉంటే 155261 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కూడా మీరు కాల్ చేయొచ్చని కేంద్రం తెలిపింది. అంతే కాకుండా మీరు మీ 12వ విడతకు సంబంధించిన డబ్బులు పడతాయో లేదో తెలుసుకోవచ్చట.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications