Market Timings: భారత స్టాక్ మార్కెట్ల రేంజ్ పెరిగింది. మార్కెట్లలోకి లక్షల సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరారు. మార్కెట్ల పరిమాణం గతంలో కంటే చాలా పెరిగింది. ఇది నిజంగా భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం ఇచ్చే అంశం. ఇలాంటి తరుణంలో స్టాక్ మార్కెట్ వేళలను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ పెంచనున్నట్లు తెలుస్తోంది.

ఈక్విటీ మార్కెట్స్..
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3.30 గంటలకు మూతపడుతున్నాయి. అయితే రానున్న కాలంలో ఈ ట్రేడింగ్ వేళలను పొడిగించటంపై గత కొన్ని వారాలుగా స్టేక్ హోల్డర్లతో చర్చలు జరుపుతోంది. అయితే విడతల వారీగా ట్రేడింగ్ వేళలను సెబీ పొడిగించవచ్చని సమాచారం. మెుదటి విడతగా ఈక్వీటీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించనున్నట్లు తెలుస్తోంది.
F&O ట్రేడింగ్..
రానున్న కాలంలో సెబీ ఎన్ఎస్ఈ ఆప్షన్ ట్రేడింగ్ మార్కెట్లను రాత్రి 11.55 వరకు తెరచి ఉంచుతుందని వినిపిస్తున్న పుకార్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ స్పందించారు. ఇది దీర్ఘకాలంలో ట్రేడర్ల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఈ వేళలను పొడిగించటం వల్ల దీర్ఘకాలంలో పార్టిసిపేషన్, లిక్విడిటీ తగ్గటానికి దారితీయవచ్చని అన్నారు. P&Lని ఎక్కువ గంటలు ట్రాక్ చేయడం ఒత్తిడితో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు.

అధికారులు ఏమంటున్నారంటే..
భారత్‌లో ప్రస్తుత స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళల వల్ల వాల్యూమ్‌లు ఆఫ్‌షోర్ మార్కెట్లకు మారుతున్నాయని ఎక్స్‌ఛేంజ్ అధికారులు చాలా కాలంగా చెబుతున్నారు. దీనిపై వాటాదారులు అందించిన అన్ని సూచనలను రెగ్యులేటరీ పరిశీలిస్తోంది. దీనిలో భాగంగా ఇండెక్స్ ఫ్యూచర్స్ టైమింగ్‌ను పెంచాలని ఒక ప్రతిపాదన ఉంది.

అమెరికా మార్కెట్లు..
రెండవ ప్రతిపాదన ప్రకారం.. కనీసం అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యేంత వరకు F&O సెగ్మెంట్‌ను తెరచి ఉంచాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయటం వల్ల ట్రేడర్లకు రాత్రిపూట నష్టాలను తగ్గించుకోవటంలో సహాయపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ ట్రేడింగ్ వేళలను పొడిగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని సెబీ చైర్‌పర్సన్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications