RBI On Loans: దేశీయ బ్యాంకింగ్ రంగంలో గడచిన దశాబ్థకాలంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక కీలక మార్పులను తీసుకొస్తోంది. ఈ క్రమంలో బ్యాంకులు కస్టమర్లను లూటీ చేస్తున్న అనేక మార్గాలను, అనేక పద్ధతులకు చెల్లుచీటీ చెబుతోంది.
చాలా మంది తమ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను లేదా నాన్-బ్యాంకింగ్ సంస్థల నుంచి రుణాలను తీసుకుంటుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వాటిని ముందుగానే చెల్లించాలని మనకు అనిపించినప్పటికీ రుణాన్ని ఇచ్చిన సంస్థలు ముందస్తు చెల్లింపుల ద్వారా లోన్ క్లోజ్ చేయటంపై కూడా అదనపు ఛార్జీలను విధిస్తుంటాయి. చాలా కాలంగా భారతదేశంలోని ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ముందుగా రుణం చెల్లించి రుణవిముక్తులు కావాలనుకుంటున్న తమకు ఇలాంటి ఇబ్బంది రావటంతో అసలు ఎందుకిలా అనే విషయంపై సమాదానం మాత్రం దొరకటం లేదు.

ఆర్బీఐ ముసాయిదా సర్క్యులర్..
గడువుకు ముందే రుణ మెుత్తాన్ని చెల్లించి కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద శుభవార్త ప్రకటించబోతోంది. వాస్తవానికి వ్యక్తులు, సూక్ష్మ, చిన్న సంస్థల వ్యాపార రుణాలపై విధించే ముందస్తు చెల్లింపు ఛార్జీలను తొలగించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. మెుదటి దశలో NBFCలు కాకుండా.. టైర్-1, టైర్-2 సహకార బ్యాంకులతో పాటు దాని పరిధిలోని సంస్థలు, వ్యక్తులు, MSE రుణగ్రహీతలు వ్యాపార ప్రయోజనాల కోసం పొందిన ఫ్లోటింగ్ రేటు రుణాల ముందస్తు చెల్లింపుపై ఎటువంటి ఛార్జీలు/జరిమానాలు విధించకూడదని సర్కులర్ పేర్కొంది.
ఈ ఆదేశాలు రుణగ్రహీతకు మొత్తం మంజూరు చేయబడిన పరిమితి రూ.7.50 కోట్ల వరకు వర్తిస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం వ్యాపారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలు మంజూరు చేసిన ఫ్లోటింగ్ రేటు పదవీకాల రుణాలపై ముందస్తు చెల్లింపు ఛార్జీలను విధించడానికి కొన్ని వర్గాల నియంత్రిత సంస్థలు అనుమతించబడవు. అక్టోబర్-డిసెంబర్ కాలంలో బ్యాంకు రుణాలు, బ్యాంకు డిపాజిట్లు త్రైమాసిక ప్రాతిపదికన తగ్గాయని ఆర్బీఐ నివేదించింది. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో 12.6 శాతంగా ఉన్న వార్షిక బ్యాంకు రుణ వృద్ధి డిసెంబర్ 2024 త్రైమాసికంలో 11.8 శాతానికి తగ్గింది. ఇదే క్రమంలో డిపాజిట్ వృద్ధి 11.7 శాతం నుండి 11 శాతానికి తగ్గింది.


Click it and Unblock the Notifications