Petrol Diesel Price: శుభవార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..
Petrol Rates: దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సామాన్యుల మనసులో ఉన్న కోపాన్ని తుడిచేసే పనుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందుకోసం అనేక తాయిలాలను అందించటం ప్రారంభించాయి.
ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తగ్గిన క్రూడ్ ధరల ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించిందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు(OMC) పెట్రోల్ డీజిల్ పై లాభాలను ఆర్జిస్తున్నాయి. అందువల్ల ధరల తగ్గింపుతో ఆ ప్రయోజనాన్ని వాహనదారులకు అందించేందుకు ఎన్నికలకు ముందరే బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

ప్రస్తుతం ముడిచమురు ధరల పరిస్థితిపై ఆర్థిక, చమురు మంత్రిత్వ శాఖలు చర్చిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులతో పాటు OMCల లాభదాయకతపై కూడా మంత్రిత్వ శాఖ చర్చిస్తోంది. కంపెనీలు పెట్రోలుపై రూ.8-10, డీజిల్‌పై రూ.3-4 లాభాన్ని ఆర్జిస్తున్నాయి. గత త్రైమాసిక లాభాల కారణంగా OMCల మొత్తం నష్టాలు ఇప్పుడు తగ్గాయి. IOC, HPCL, BPCL గత త్రైమాసికంలో రూ.28,000 కోట్ల లాభాలను ఆర్జించాయి.
వాస్తవానికి పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. గతేడాది నుంచి దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మే 21, 2022న ఇంధన ధరలు తగ్గించబడ్డాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ తర్వాత పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అయితే చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ తగ్గింపును అక్కడి ప్రజలకు అందించలేదు. దీంతో ధరలు పెరిగినప్పుడు పెంచటం.. తగ్గినప్పుడు దానిని ప్రజలకు అందించకపోవటంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications