Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. త్వరలో రూ.85,000లకు పసిడి ధర, ఇన్వెస్టర్లకు పండగే..
Gold Price: గడచిన నెల రోజులుగా పసిడి ధరలు సామాన్యుల ఊహలకు సైతం అందని రీతిలో దూసుకుపోతున్నాయి. ఫెడ్ రేట్ల తగ్గింపు పోసిన ఆజ్యంతో పసిడి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకిన సంగతి తెలిసిందే. దీనికి మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిణామాలు మరింతగా తీవ్రతరం చేశాయి. ఇవి ప్రస్తుతం భారతీయ పసిడి కొనుగోలుదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దసరా, దీపావళికి షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వారికి ఇది పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.
భారతీయులకు గోల్డ్, సిల్వర్ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దసరా నవరాత్రులు, ధనత్రయోదశి, దీపావళి నవంబరులో రాబోతున్నాయి. దీనికి తోడు మెగా పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం అయ్యింది. లక్షల్లో జరగనున్న పెళ్లిళ్ల ప్యామిలీలు కోట్ల విలువైన పసిడి కొనుగోలుకు ప్లాన్ చేస్తున్న సమయంలో ధరల పెరుగుదన షాక్‌కి గురిచేస్తున్నాయి. గడచిన 10 నెలలుగా గోల్డ్ రేట్లు ఏకంగా 19.80 శాతం రాబడిని అందించాయి. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు త్వరలో ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకుంటాయని ఇటీవల సిటీ గ్రూప్, గోల్డ్‌మాన్ సాక్స్, బీఎంఐ నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ర్యాలీలో ఉన్న గోల్డ్ ధర ఔన్సుకు 2678.70 డాలర్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

బంగారాన్ని పూర్వకాలం నుంచి సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే సంపదను పెంచుకోవటానికి అనిశ్చిత సమయాల్లో దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల గోల్డ్‌మాన్ సాక్స్ నివేదికలో పసిడి ఏడాది చివరి నాటికి 2900 డాలర్ల మార్కును అధిగమిస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక పరిణామాలు గోల్డ్ ఇన్వెస్టర్లకు భారీగా కలిసొస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్ నాటికి గోల్డ్ 12 శాతం మేర రాబడిని అందిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి మూడు నెలల కాలంలో 12 శాతం పెరుగుదల అంటే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం కమోడిటీ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా అనేక విలువైన లోహాల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ప్రస్తుతం గ్లోబల్ సంక్షోభ సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తూ.. పెద్ద సంస్థలు సెంట్రల్ బ్యాంకులు అధిక స్థాయిల్లో గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి.
ఇది పరోక్షంగా రిటైల్ మార్కెట్లలో గోల్డ్ రేట్లను వేగంగా పెంచటం మనం గమనించవచ్చు. ప్రస్తుతం గోల్డ్ రేట్లు 10 గ్రాములకు MCXలో రూ.76వేలు పలుకుతోంది. అయితే డిసెంబర్ నాటికి ఇది రూ.85,000 చేరుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. సాధారణ వినియోగదారులకు ఇది పెద్ద భారమే అయినప్పటికీ బంగారంపై పెట్టుబడులు, బెట్టింగ్ వేసే ఇన్వెస్టర్లకు మాత్రం మంచి రాబడులను తెచ్చిపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications