Gold News: షాకివ్వనున్న గోల్డ్ ధరలు.. అమెరికా అప్పు ముప్పు ఎఫెక్ట్.. ఇక గోల్డ్ కొనలేమా..?
Gold News: అమెరికా డెట్ సీలింగ్ ఒప్పందం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో దాని ప్రభావం బంగారం ధరలపై కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. అంచనాల ప్రకారం రానున్న కాలంలో దాదాపు 25 శాతం మేర పెరగొచ్చని ఒక అంచనా.
డెట్ సీలింగ్ ఖరారు తర్వాత గోల్డ్ ధరలు పెరుగుతాయని గ్లోబల్ స్థూల-పెట్టుబడి సంస్థలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ వెల్లడించారు. నిపుణుల అంచనా ప్రకారం ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్లోబల్ బ్యాంకులు తమ ఫారెక్స్ నిల్వల కోసం బంగారంపై ఎక్కువ మెుగ్గు చూపుతాయని తెలుస్తోంది.

బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌లో గోల్డ్ హోల్డింగ్‌ల వాటాను చారిత్రక సగటు 40 శాతానికి పెంచినట్లయితే.. బంగారం ధర ఔన్స్‌కి 25 శాతం పెరిగి 2500 డాలర్ల వరకు పెరగవచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో డెట్ సీలింగ్ చర్చలు పరిష్కారానికి వస్తున్న తరుణంలో మార్కెట్లో సెక్యూరిటీల ధరలు తగ్గుతాయని.. ఇదే క్రమంలో బ్యాంకులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. దీర్ఘకాలంలో వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.
1971లో గోల్డ్ స్టాండర్డ్ ముగిసిన తర్వాత కూడా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే విదేశీ సెంట్రల్ బ్యాంకులు మళ్లీ తమ వైఖరిని మార్చుకున్నాయి. బంగారానికి కొనుగోలుదారులుగా ఉన్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం సమయంలో అనేక మంది పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారం వంటి సేఫ్ మార్గాల్లోకి మళ్లించటం కూడా గోల్డ్ ధరల పెరుగుదలకు కారణంగా నిలిచింది.


Click it and Unblock the Notifications