డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! త్వరలో ఎలాంటి టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ ట్రెయినింగ్ సెంటర్ అక్రిడేషన్ కేంద్రాలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్(MoRTH) డ్రైవర్ ట్రెయినింగ్ కేంద్రాల అక్రిడేషన్ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు ట్రెయినింగ్ సెంటర్స్ అనుసరించాల్సిన విధివిధానాలను డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల అక్రెడిటేషన్(గుర్తింపు)కు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ కేంద్రాల్లో శిక్షణ పూర్తిచేసుకున్న వారు డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రత్యేకించి మళ్లీ డ్రైవింగ్ పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేదని డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారు.

ఉత్తమ డ్రైవర్లను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని, దీని వలన రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. గత నెల 29న జారీచేసిన ఈ డ్రాఫ్టును, ప్రజాభిప్రాయం కోసం రవాణా శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలని కేంద్ర రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications