విమాన కనెక్టివిటీని పెంచుతూ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు ఇండిగో రెండు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తూర్పు ఆసియా దేశమైన శ్రీలంకలోని ఆకర్షణీయమైన హాలిడే గమ్యస్థానాలను అన్వేషించాలనుకునే ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాలను అందించడమే లక్ష్యంగా ఈ రెండు కొత్త సేవలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు..
అక్టోబర్ 29, 2023 నుంచి హైదరాబాద్-సింగపూర్ మార్గంలో ఇండిగో సర్వీసులను ప్రారంభించనుంది. సింగపూర్ వెళ్లే 6ఈ-1027 విమానం హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 2.50 గంటలకు (IST) బయలుదేరి 10:00 గంటలకు (సింగపూర్ స్టాండర్డ్ టైమ్) సింగపూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణానికి 6ఈ-1028 విమానం సింగపూర్ నుంచి 23:25 గంటలకు (సింగపూర్ స్టాండర్డ్ టైమ్) బయలుదేరి 07.30 గంటలకు (IST) హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రోజువారీ నాన్ స్టాప్ ఫ్లైట్ ఆసియా, ఆస్ట్రేలియాతో పాటు అనేక ఇతర గమ్యస్థానాలకు అంతరాయం లేని కనెక్టివిటీతో కీలకమైన రవాణా కేంద్రం అయిన సింగపూర్ కు కనెక్టివిటీని పెంచుతుంది.

ఆధానంగా 2023 నవంబర్ 3న హైదరాబాద్-కొలంబో మార్గంలో ఇండిగో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. కొలంబోకు 6ఈ-1181 విమానం హైదరాబాద్ నుంచి 11.50 గంటలకు (IST) బయలుదేరి 14:00 గంటలకు (IST) కొలంబో చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 6ఈ-1182 విమానం కొలంబో నుంచి 15:00 (IST) గంటలకు బయలుదేరి 17:00 గంటలకు (IST) హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది.
"కనెక్టివిటీలో ఈ ఉత్తేజకరమైన అభివృద్ధిలో భాగం కావడం మాకు సంతోషంగా ఉంది. విమానయాన సంస్థలు మరిన్ని అంతర్జాతీయ మార్గాలను ఏర్పాటు చేయడంతో, దక్షిణ, మధ్య భారతదేశం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు ఇప్పుడు వారి ప్రయాణ గమ్యస్థానాలను అన్వేషించడానికి విస్తృత శ్రేణి ఎంపికలను కలిగి ఉంటారు. కనెక్టివిటీని పెంచడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే మా ప్రయాణీకుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఉన్నాయి" అని జీహెచ్ఐఎఎల్ సీఈఓ ప్రదీప్ పణికర్ చెప్పారు.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications