Sony Zee Merger: సోనీ గ్రూప్-జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విలీనాన్ని విరమించుకోవడానికి సదరు సంస్థలు చూస్తున్నాయి. గత కొంత కాలంగా డీల్ ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అనేక అడ్డంకులు వస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు 10 బిలియన్ డాలర్లు విలువైన మీడియా హౌస్‌ను సృష్టించేందుకు చేసిన ప్రయత్నాలు ముగింపుకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జీ కంపెనీ నాయకత్వంపై పరిష్కారం కాని వివాదం కారణంగా జపాన్ కు చెందిన సోనీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. 2021లో ఒప్పదం ప్రకారం కొత్త కంపెనీకి నాయకత్వం వహించాలని మొదట నిర్ణయించిన సోనీ ఇప్పుడు కొనసాగుతున్న నియంత్రణ విచారణ మధ్య గోయెంకా సంస్థకు నాయకత్వం వహించాలని కోరుకోవడం లేదు.

విలీన ఒప్పందాన్ని ముగించటానికి జనవరి 20, 2024 గడువు ఉన్నప్పటికీ దీనికంటే ముందే డీల్ రద్దు నోటీసులను సోనీ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు రహస్య సమాచారం బయకు రావటం మార్కెట్లో పెద్ద దుమారం చెలరేగుతోంది. అయితే ఇప్పటికీ రెండు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా రెండు పార్టీలు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ప్రస్తుతం జీ ఎంటర్టైన్మెంట్ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన అనేక మంది ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే డీల్ ముగియటం అంబానీకి చెందిన ఓటీటీ కంపెనీలకు కొంత లాభాన్ని చేకూర్చగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే డిస్నీని రిలయన్స్ కొనుగోలు చేసే దిశగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.
ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి జీ కంపెనీ షేర్ ధర NSEలో 1.63 శాతం నష్టపోయి రూ.278.45 వద్ద ముగిసింది. అయితే ఈవార్తతో రేపు స్టాక్ మార్కెట్లో Zee Entertainment Enterprises Limited షేర్లు కుప్పకూలతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి గతంలో డీల్ నిబంధల ప్రకారం విలీనం జరిగి ఉంటే సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రైవేట్ విలీన మీడియా సంస్థలో 50.86% వాటాను కలిగి ఉండవలసి ఉండగా, గోయెంకా కుటుంబం 3.99% వాటాను కలిగి ఉండేది.


Click it and Unblock the Notifications