Gaming Industry News: ఈరోజుల్లో ఏదో ఓ మూల నుంచి లేఆఫ్స్ అనే మాట వింటూ ఉండటం నిత్యకృత్యమైపోయింది. దిగ్గజ కంపెనీల నుంచి చిన్నపాటి సంస్థల వరకు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. తాజాగా ప్రముఖ గేమింగ్ సంస్థ ఈ లిస్టులో చేరింది.
సోనీ గ్రూప్ కార్ప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వీడియో గేమ్ విభాగంలోని ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. దాదాపు 900 మంది వ్యక్తులకు ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. దీంతో తన వర్క్ ఫోర్స్‌లో దాదాపు 8 శాతం మంది కొలువులు కోల్పోనున్నారు. దీనితోపాటు లండన్‌లోని ఓ గ్రూప్‌ను పూర్తిగా మూసివేయనుంది.

'నెలల తరబడి జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం ఓ కీలక నిర్ణయానికి వచ్చాం. నాయకత్వంతో పలు ధపాల చర్చల తర్వాత వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి, కంపెనీని ముందుకు నడిపించడానికి స్పష్టమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం' అని సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రెసిడెంట్ మరియు CEO జిమ్ ర్యాన్ ఓ నోట్‌లో పేర్కొన్నారు. సిబ్బంది కోతలపై అందులో ప్రస్తావించారు.
ఈ తొలగింపులు 3 అత్యంత విజయవంతమైన తన గేమ్ మేకర్స్ పై ప్రభావం చూపుతాయని సోనీ తెలిపింది. ఇన్‌సోమ్నియాక్ (స్పైడర్ మ్యాన్ బ్యాక్డ్ స్టూడియో), నాటీ డాగ్ (ది లాస్ట్ ఆఫ్ అస్) మరియు గెరిల్లా గేమ్స్ (హారిజన్) అనే అనుబంధ సంస్థల ఉద్యోగులు బాధితులు కానున్నట్లు వెల్లడించింది. నివేదికల ప్రకారం గెరిల్లా గేమ్స్ సిబ్బందిలో 10 శాతం కోతలు సహా మల్టిపుల్ వర్చువల్ రియాలిటీ గేమ్‌లకు ప్రసిద్ధి చెందిన సోనీ ప్లేస్టేషన్ లండన్ కూడా మూసివేయబడనున్నట్లు పేర్కొంది.
ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా ఎక్కువ కాలం ఆర్జించడానికి ప్లేస్టేషన్ మేకర్ గతంలో పలు గేమ్స్ రూపకల్పనకు భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ ఈ గేమ్స్ మార్కెట్ ఇప్పుడు ఓవర్ శాచురేటెడ్‌గా మారింది. చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. సోనీ ఇటీవల స్పైడర్ మ్యాన్ మరియు ది లాస్ట్ ఆఫ్ అస్ ఆన్‌లైన్ గేమ్‌లను రద్దు చేసింది. కాగా కోతల్లో భాగంగా ట్విస్టెడ్ మెటల్ రేసింగ్ ఫ్రాంచైజీపై ఆధారపడిన సర్వీస్ గేమ్‌ను కూడా ఇప్పుడు నిలిపివేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications