Dividend: రెండవ త్రైమాసికం ఫలితాలను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలో అనేక కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని తమ పెట్టుబడిదారులకు డివిడెండ్ రూపంలో ఇస్తున్నాయి.

ఐటీ కంపెనీ..
తాజాగా స్మాల్‌క్యాప్ ఐటి స్టాక్ sonata software తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ టెక్ కంపెనీ 700% మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో షేరుకు రూ.7 డివిడెండ్ అందిస్తోంది. రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.112.71 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గడచిన ఏడాదితో పోల్చితే 23.63% ఎక్కువ.

పొందటం ఎలా..
డివిడెండ్ పొందటానికి రికార్డు తేదీగా నవంబర్ 1, 2022ని కంపెనీ బోర్డు నిర్ణయించింది. అంటే ఆ తారీఖు నాటికి కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లకు కంపెనీ నవంబర్ 14 లేదా ఆ తర్వాత డబ్బును చెల్లిస్తుంది. గతం నుంచి తన పెట్టుబడిదారులకు మంచి డివిడెండ్ రాబడిని అందిస్తున్న ట్రాక్ రికార్డును ఈ కంపెనీ కలిగి ఉంది.

2000 నుంచి..
చాలా తక్కువ కంపెనీలు మాత్రమే క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లిస్తుంటాయి. సొనాటా సాఫ్ట్‌వేర్ కంపెనీ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 46 సార్లు డివిడెండ్ ప్రకటించింది. కేవలం గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఒక్కో షేరుపై రూ.21 డిజవిడెండ్ చెల్లించింది. ప్రస్తుత ప్రకటన తర్వాత కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. సాయంత్రం 3.11 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.507.90 వద్ద ఉంది. గడచిన 5 ఏళ్ల కాలంలో కంపెనీ షేర్ ధర ఏకంగా 330 శాతం వృద్ధి చెందింది.

కంపెనీ వ్యాపారం..
సొనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న దేశీయ ఐటీ సేవల సంస్థ. ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్, అప్లికేషన్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, మొబిలిటీ, క్లౌడ్, సోషల్ మీడియా, టెస్టింగ్, ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ సర్వీస్ వంటి రంగాల్లో తన సేవలను అందిస్తోంది. 1986లో ఈ కంపెనీని స్థాపించారు. ఇతర దేశాల్లో సైతం కంపెనీ తన వ్యాపారాలను నిర్వహిస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications