IPO News: మోసం చేసిన ఐపీవో.. తొలిరోజే భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు.. పాపం..
Sona Machinery IPO: ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించలేని స్థాయిలో కుదుపులకు గురవుతున్నాయి. దీంతో మార్కెట్లలోకి అడుగుపెడుతున్న కొన్ని ఐపీవోలు సైతం ప్రభావితం అవుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సోనా మెషినరీ కంపెనీ ఐపీవో గురించే. ఈరోజు మార్కెట్లో జాబితా అయిన ఐపీవో షేర్లు ఇన్వెస్టర్లను తొలిరోజే పూర్తిగా నిరాశపరిచాయి. ఐపీవోపై పందెం కాసిన ఇన్వెస్టర్లు నష్టాలతో షాక్‌కి గురవుతున్నారు. కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 12.58 శాతం తగ్గింపు ధర రూ.125 వద్ద లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ కోసం ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.136 నుంచి రూ.143గా ఉంచింది.

ఇటీవల ఐపీవోలలో లిస్టింగ్ గెయిన్స్ చూసిన అనేక మంది పెట్టుబడిదారులు కంపెనీ షేర్లను కొనుగోలు చేయగా.. పేలవమైన లిస్టింగ్ తర్వాత వారు తమ వాటాలను నష్టాలకు విక్రయించుకున్నారు. డిస్కౌంటెడ్ ధరకు లిస్ట్ అయిన తర్వాత కంపెనీ షేర్లు మరో 5 శాతం పతనమయ్యాయి. లోయర్ సర్క్యూట్ విధించిన తర్వాత కంపెనీ షేర్ల ధర రూ.118.75 స్థాయికి పడిపోయింది.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మార్చి 5న తెరవబడిన ఐపీవో మార్చి 7 వరకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం లాట్ పరిమాణాన్ని కంపెనీ 1000 షేర్లుగా నిర్ణయించింది. దీంతో పెట్టుబడిదారులు కనీసం రూ.1,43,000 పందెం వేయాల్సి వచ్చింది. వాస్తవానికి ఐపీవోకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే చివరికి షేర్లు డిస్కౌంట్ రేటుకు అడుగుపెట్టడం అందరినీ షాక్ కి గురిచేసిందని చెప్పుకోవాలి. ఇష్యూ సమయంలో రిటైలర్ల విభాగం 235 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. అలాగే మొదటి, రెండవ రోజు వరుసగా 41.13 రెట్లు, 13.58 సార్లు సభ్యత్వం పొందింది.


Click it and Unblock the Notifications