పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 క్రాస్ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకంగా రూ.110 పెరిగింది. చమురు ధరలు తగ్గించాలని విపక్షాలతో పాటు సామాన్యులు కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కొద్ది నెలల్లో ధరల భారం నుండి ఉపశమనం లభించే అవకాశం ఉందని చెప్పారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా దిగి వస్తుననాయని చెప్పారు. పెట్రోల్ ధరల అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితమైనదిగా భావిస్తోందన్నారు. ఇంధనాలపై సుంకాల పెంపును సమర్థించుకున్నారు. లీటర్ పెట్రోల్ పైన ప్రభుత్వం రూ.32మేర ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోందని, తద్వారా సమకూరిన డబ్బును ఉచిత రేషన్, వ్యాక్సీనేషన్, వివిధ సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తోందన్నారు. 2010 ఏప్రిల్ నెలలో నాటి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.32 ట్యాక్స్ విధించేదని, ఇప్పుడు అంతే మొత్తాన్ని తమ ప్రభుత్వం విధిస్తుందన్నారు.

ఇదిలా ఉండగా, పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం(ఆగస్ట్ 26) స్థిరంగా ఉన్నాయి. మొన్న లీటర్ పెట్రోల్ పైన 15 పైసలు, లీటర్ డీజిల్ పైన 15 పైసలు తగ్గింది. నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు ఈ ఆదివారం తగ్గాయి. సోమవారం తిరిగి స్థిరంగా ఉండగా, మొన్న మళ్లీ తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్నాయి. డీజిల్ ధరలు ఇటీవల పలుమార్లు తగ్గాయి. 35 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధర ఆదివారం 15 పైసల నుండి 20 పైసలు తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధరలు గతవారం మొదట మూడు రోజులు తగ్గి, ఒకరోజు స్థిరంగా ఉండి, ఆదివారం మళ్లీ తగ్గాయి. ఆదివారం డీజిల్ 18 పైసల నుండి 20 పైసల మధ్య తగ్గింది. ఇటీవలి వరకు నెల రోజులకు పైగా ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. చివరిసారి (గత నెలలో) లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. గత నెల(జూలై)లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ ఆగస్ట్ నెలలో ధరలు ఇప్పటి వరకు పెరగలేదు. పైగా డీజిల్ ధరలు ఐదుసార్లు, పెట్రోల్ ధర రెండుసార్లు తగ్గింది. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదలలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.49, లీటర్ డీజిల్ రూ.88.92గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.52, డీజిల్ రూ.96.48గా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.63, లీటర్ డీజిల్ రూ.97.16గా ఉంది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
More From GoodReturns

పెట్రోల్,డీజిల్ ధరల షాక్.. ఒక్కసారిగా రూ.55 పెంపు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications