Multibagger Stock: ఇన్వెస్టర్లకు లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. మీ దగ్గర ఉందా..?
Multibagger Stock: ఏటేటా ఇండియాలో లిక్కర్ విక్రయాల నుంచి ఆదాయాలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇవి బ్లూవరీస్ కంపెనీల లాభాలను పెంచుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న లిక్కర్ స్టాక్ సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్ గురించే. ఇది గత ఏడాది కాలంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఈ క్రమంలో గత ఏడాది జూన్ 13న రూ.63.50 వద్ద ఉన్న కంపెనీ షేర్ ధర ఈరోజు మధ్యాహ్నం 1.09 గంటల సమయంలో రూ.246.50 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడవుతోంది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు దాదాపు 290 శాతం రాబడిని పొందారు.

ఎవరైనా ఇన్వెస్టర్ ఏడాది క్రితం కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి ఉంటే ప్రస్తుతం వారి డబ్బు మూడింతలయ్యేది. మధ్యప్రదేశ్‌లోని బీర్ పరిశ్రమలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకున్నట్లు ఇటీవల కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీకి అందించిన వివరాల్లో వెల్లడించింది. మే 2023లో కంపెనీ దాదాపు 42 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. కంపెనీ అన్ని పోటీదారులను అధిగమిస్తూ.. అనేక మంది మెచ్చిన నంబర్ వన్ బీర్ బ్రాండ్‌గా నిలిచింది.
ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే కంపెనీ ఆదాయం 79.44 శాతం పెరగగా, లాభం 148.31 శాతం పెరిగింది. కంపెనీ ఇటీవలి ట్రేడింగ్ డేటా ప్రకారం.. ప్రమోటర్లు నిరంతరం కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. వారు తమ వాటాను వేగంగా పెంచుకుంటున్నారు. సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్ దేశంలోని ప్రముఖ మద్యం తయారీ కంపెనీలలో ఒకటి. కంపెనీ బీరుతో పాటు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్)ను కూడా తయారు చేస్తోంది.


Click it and Unblock the Notifications