Multibagger: దూసుకుపోతున్న సోలార్ స్టాక్.. ఆ నిర్ణయంతో అప్పర్ సర్క్యూట్..
Solar Stock: రాబోతున్నది గ్రీన్ ఎనర్జీ యువగం. దేశంలో పవర్ వినియోగం సైతం భారీగా పెరుగుతున్న వేళ కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు చక్కడి ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల గురించే. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఇటీవల అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యింది. దీనివెనుక కారణం కంపెనీ స్టాక్ స్పిట్ చేయాలని భావిస్తున్నట్లు తెలియటమే. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 9.41 శాతం లాభపడి రూ.2,689.40 వద్ద ఉంది. అలాగే కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.5520 కోట్లుగా నిలిచింది.

ఏడాది కిందట స్టాక్ ధర జనవరి 11, 2023న 52 వారాల కనిష్ఠమైన రూ.470 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.2703.95ని జనవరి 5, 2024న తాకింది. ప్రస్తుతం స్టాక్ ఓవర్ బాట్ జోన్ లో కొనసాగుతోందని తెలుస్తోంది. అంటే ఏడాది కాలంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు 400 శాతానికి పైగా రాబడులను అందించింది. అయితే జనవరి 20న జరగబోయే బోర్డు సమావేశంలో స్టాక్ స్పిట్ గురించి కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం మల్టీబ్యాగర్ పై మరిన్ని ఆశలు పెంచుతోంది.
వారీ రెన్యూవబుల్స్ దేశంలోని ప్రముఖ సోలార్ ప్యానెల్ ఉత్పత్తిదారుగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. కంపెనీ ఇప్పటికే 10,000కు పైగా సోలార్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని విజవయంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీకి 600 మెగావాట్ల కంటే ఎక్కువసామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉన్నప్పటికీ కంపెనీ వ్యాపారం మెరుగైన పనితీరు కారణంగా ఇన్వెస్టర్లు భవిష్యత్తులో మంచి అవకాశం ఉన్న సోలార్ స్టాక్ లో కొనుగోళ్లకు మెుగ్గుచూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications