Ganesh Green Bharat IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన సోలార్ కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్లను లాభాల సంద్రంలో ముంచేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గణేష్ గ్రీన్ భారత్ ఐపీవో గురించే. సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ కంపెనీ ఐపీవో ఎన్ఎస్ఈలో నేడు అద్భుతమైన లిస్టింగ్ నమోదు చేసింది. కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.379.05 వద్ద మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో షేర్లను రూ.190 గరిష్ఠ ధరకు విక్రయించగా.. 99.5 శాతం ప్రీమియం ధరకు బలమైన లిస్టింగ్ నమోదు చేసింది. లిస్టింగ్ తర్వాత స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. తాజా ఐపీవో ద్వారా రూ.125.23 కోట్లను సమీకరించిన కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.181-190గా ఉంచింది.

ఐపీవో జూలై 5న ప్రారంభమై జూలై 9న ముగిసింది. నేడు కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీ ఎమర్జ్‌లో జాబితా అయ్యాయి. ప్రస్తుత ఐపీవో కోసం కంపెనీ 65.91 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. వాస్తవానికి గణేష్ గ్రీన్ ఏప్రిల్ 2016లో స్థాపించబడింది. కంపెనీ ప్రస్తుతం సోలార్ PV మాడ్యూల్ తయారీ, పవర్ కాంట్రాక్టు సర్వీసెస్, నీటి సరఫరా ప్రణాళిక ప్రాజెక్టులపై పనిచేస్తోంది. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీ మొత్తం స్థాపిత సామర్థ్యం 236.73 మెగావాట్లుగా ఉంది.
మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రాబోయే మూడేళ్లలో ఈక్విటీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు గత మూడేళ్లుగా రాబడులు ఉండవని చెప్పింది. పెద్ద సంఖ్యలో IPOలను సూచిస్తూ, కొత్తగా లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడి పెట్టే అదనపు నిధులను గ్రహించేందుకు మార్గాలను సృష్టిస్తున్నాయని కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఆర్ జానకిరామన్ తెలిపారు. కంపెనీల వద్ద ఈక్విటీ రాబడి గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయ వృద్ధి కంటే మెరుగ్గా ఉంది. పెట్టుబడిదారులు ఇప్పుడు రివర్స్ జరగడాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.


Click it and Unblock the Notifications