65,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్ సోలానా, బియాన్స్ కాయిన్ డౌన్
మేజర్ క్రిప్టో కరెన్సీలు గతవారం లాభపడ్డాయి. ఈ వారం ప్రారంభంలో కూడా అదే ధోరణిని కనబరిచాయి. మేర్ క్రిప్టోలు లాభపడినప్పటికీ, కొన్ని క్రిప్టోల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేశారు. టాప్ 10లోని ఆరు క్రిప్టోలు ఉదయం సెషన్‌లో లాభాల్లో కనిపించాయి. బియాన్స్ కాయిన్, సోలానా ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోయాయి. ఎక్స్‌పీఆర్ ఏకంగా తొమ్మిది శాతం లాభపడింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 శాతం పెరిగి 2.85 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 97.46 బిలియన్ డాలర్లు.
క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు భారీగా లాభపడి 65,000 డాలర్లను క్రాస్ చేసింది. మన కరెన్సీలో ఇది రూ.48,36,514 వరకు ఉంటుంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవలే జేపీ మోర్గాన్ చేజ్, వీసా కంటే ఎక్కువగా నమోదు చేసింది. బిట్ కాయిన్ మూడు వారాల గరిష్టాన్ని తాకింది. ఈ క్రిప్టో మార్కెట్ క్యాప్ 1.24 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రితం సెషన్‌లో ఏకంగా 66వేల డాలర్లు కూడా దాటింది. ఆల్ టైమ్ గరిష్టం 67 వేల డాలర్లు.

మరోవైపు, ఎథేరియం 4768 డాలర్లను తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ క్రిప్టో 3.98 శాతం ఎగిసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 555.56 డాలర్లు. గత అక్టోబర్ నుండి ఇప్పటి వరకు ఎథేరియం 59 శాతం జంప్ చేసింది. బిట్ కాయిన్ 51 శాతం లాభపడింది.
డాలర్ కరెన్సీలో క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin - 65,878.74 - 6.53% వృద్ధి
- Ethereum - 4,729.39 - 3.86% వృద్ధి
- Dogecoin - 0.279896 - 6.93% వృద్ధి
- Litecoin - 209.03 - 4.51% వృద్ధి
- XRP - 1.29 - 9.40% వృద్ధి
- Cardano - 2.04 - 2.61% వృద్ధి
- Tether - 1.0014 - 0.12% వృద్ధి
- Binance Coin - 654.22 (క్షీణత)
- Polkadot - 52.88


Click it and Unblock the Notifications