Bengaluru News: ఆ ఆలయానికి క్యూ కడుతున్న సాఫ్ట్ వేరు ఉద్యోగులు..
దేశంలో ఐటీకి పేరుగాంచిన నగరం ఏది అంటే.. బెంగళూరు అని చెబుతాం. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు బెంగళారు చాలా ఫేమస్. ఇక్కడ లక్షల్లో సాఫ్ట్ వేరు ఉద్యోగులు ఉంటారని పేరు ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్న గుడిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. కోరమంగళలో ఉన్న ప్రసన్న గణపతి ఆలయం ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. కోరమంగళలో ఉన్న గణేషుడి ఆలయానికి ఓ పేరు ఉంది. అదే టెకీ గణేశ. అవును.. మీరు విన్నది నిజమే.. ఈ గుడికి వచ్చి పూజలు చేస్తే ఐటీ రంగంలో మెరుగైన ఉద్యోగాలు, పదోన్నతులు, కెరీర్ వృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుందని చాలా మందికి నమ్మం. అందుకే ఈ గణనాథుడిని టెక్కీ గణేశ అని పిలుస్తారు.
ఆయితే ఈ ఆలయంలో ఈ మధ్య కాలంలో భక్తుర రద్దీ భారీగా పెరిగింది. చాలా మంది ఐటీ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ ఆలయానికి భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే సాఫ్ట్ వేరు జాబ్ చేస్తున్నవారు.. తమకు ప్రమోషన్లు రావాలని దేవుడిని కోరుకుంటున్నారు. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నవారు.. తమకు ఉద్యోగం రావాలని గణేషుడికి మొక్కుతున్నారు. సోషల్ మీడియాలో టెక్కీ గణేశ పై భారీగా ప్రచారం జరగడంతో చాలా మంది భక్తులు వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఆలయం గురించి ఓ వీడియో చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అతను ఇన్ స్టా రీల్ లో ప్రసన్న గణపతి ఆలయానికి.. ఈ ఆలయానికి టెక్కీ గణేశ అని పేరు ఉందని.. ఇక్కడికి వచ్చిన వారికి సాఫ్ట్ వేరు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో భారీగా భక్తులు వస్తున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండేదని స్థానిక వ్యక్తి గుర్తు చేశారు. కానీ ఐటీ ఉద్యోగుల రాకతో రద్దీ ఏర్పడిందని చెప్పారు. దీంతో అంతా గందరగోళంగా ఉందని పేర్కొన్నాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని గుర్తు చేశారు.
తాను దాదాపు మూడు దశాబ్దాలుగా కోరమంగళలో నివసిస్తున్నామని ఒక వ్యక్తి చెప్పారు. ప్రతిరోజూ ఈ ఆలయం మీదుగా వెళ్తుంటామని.. సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందకముందే స్థానికులకు దీని చరిత్ర, ప్రాముఖ్యత తెలుసని వారు తెలిపారు. ఆలయాన్ని సందర్శించడం వల్ల తమ జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని ప్రజలు నమ్మితే తప్పు లేదని.. ఎవరైనా దేవుడి వద్దకు తమ కోరికలు తీర్చాలని వెళ్తారని గుర్తు చేశారు. ఒకప్పుడు ప్రార్థనకు అనువైన ప్రశాంతమైన ప్రదేశంగా ఉన్న ఈ ఆలయం, ఇప్పుడు ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారిందని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా మన హైదరాబాద్ కు దగ్గరలో ఉండే చిలుకూరు బాలాజీకి కూడా ఓ పేరు ఉంది. అదే వీసా టెంపుల్ అని. ఇక్కడికి వచ్చిన వారికి త్వరగా వీసా వస్తుందని నమ్మకం ఉంది.


Click it and Unblock the Notifications