జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ గత మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 961.6 బిలియన్ యెన్ (రూ.68,000 కోట్లు)ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. భారీ నష్టానికి కార్యాలయ స్థల షేరింగ్ సంస్థ వీ-వర్క్ సహా పలు విజన్ ఫండ్ పెట్టుబడులు భారీగా కోల్పోవడమే కారణం. వీ-వర్క్, ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్, ఓయో వంటి విజన్ ఫండ్ బిజినెస్ ద్వారా 1.9 ట్రిలియన్ యెన్‌లు (17.7 బిలియన్ డాలర్లు) కోల్పోయింది.

39 ఏళ్లలో భారీ నష్టం
మొత్తంగా మార్చితో ముగిసిన 12 నెలల కాలానికి కంపెనీ ఆపరేటింగ్ లాస్ 1.36 ట్రిలియన్ యెన్‌లు. నెట్ లాస్ 961.6 బిలియన్ యెన్‌లు. బలహీన ఫలితాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ బ్యాంక్ షేర్ ధరలు కూడా పతనమయ్యాయి. కంపెనీ 39 ఏళ్ల చరిత్రలో ఇంత దారుణంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్ బ్యాంక్ 1.4 లక్షల కోట్ల యెన్‌ల భారీ లాభాన్ని ఆర్జించింది. అమ్మకాలు కూడా 6.2 లక్షల కోట్ల యెన్‌లకు పెరిగాయి.

వాటికి తోడు కరోనా దెబ్బ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఎటువంటి అంచనాలను వెల్లడించలేదు. వీ-వర్క్‌తో పాటు ఉబర్, ఇతర సంస్థల్లో కంపెనీ పెట్టిన పెట్టుబడుల విలువలు భారీగా తగ్గాయి. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అమెరికాలో టీ-మొబైల్‌లో స్ప్రింట్ విలీనం ఒక్కటే సానుకూల అంశంగా ఉంది. 47 బిలియన్ డాలర్ల యూనికార్న్‌గా బిజినెస్‌గా భావించిన వీ-వర్క్ ఇప్పుడు తలనొప్పిగా మారింది. ప్రధానంగా పెట్టుబడులు దెబ్బతీశాయి.

జాక్ మా రాజీనామా
నష్టాల్లో కూరుకుపోయిన సాఫ్ట్ బ్యాంకు బోర్డు నుండి అలీబాబా అధినేత జాక్ మా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంపెనీ ఆర్థిక ఫలితాలు వెల్లడించకముందే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు. కానీ ఆయన దాతృత్వంపై దృష్టి సారించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications