Quick Commerce News: ఇ-కామర్స్ అభివృద్దితో కావలసిన వస్తువుని ఇంటి దగ్గరకే ఆర్డర్ చేసి తెప్పించుకునే సౌలభ్యం దొరికింది. కేవలం రెండు, మూడు రోజుల వ్యవధిలోనే దూరాన్ని బట్టి సదరు ఉత్పత్తి ఇంటికి చేరేంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కేవలం నిమిషాల టైంలోనే ఆయా ప్రొడక్ట్స్ డెలవరీ అవుతున్నాయి. క్విక్ కామర్స్ సేవల దిశగా పలు సంస్థలు ముందుకు సాగుతున్నాయి.
ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న జొమాటో.. ఇటీవల క్విక్ కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. బ్లింకిట్ ద్వారా పలు సేవలను అందిస్తోంది. అయితే ఆ సంస్థ చేసిన ఓ చిన్న పని ఇప్పుడు నెట్టింట ప్రశంసలు దక్కించుకుంటుంది. కేవలం ఒకేఒక్క సందేశం పంపించి సోషల్ మీడియా యూజర్ల మనసు దోచేసింది.

ఆన్‌లైన్ కిరాణా డెలివరీ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్‌తో తనకు జరిగిన ఓ అనుభవాన్ని ఇటీవల ఒక కస్టమర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రభాత్ మోత్వాని అనే వ్యక్తి సదరు క్విక్ కామర్స్ యాప్ ద్వారా కొన్ని వస్తువులను ఆసుపత్రి నుంచి ఆర్డర్ చేశారు. అతని లొకేషన్ గమనించిన బ్లింకిట్.. ఆ ఆర్డర్‌కు ప్రైయారిటీ ఇచ్చింది. అతనితో పాటు కుటుంబ సభ్యులకు విషెస్ తెలిపింది.
'బ్లింకిట్ పంపించిన చిన్న సందేశం చాలా సంతోషాన్ని ఇచ్చింది. హాస్పిటల్ నుంచి ఆర్డర్ చేస్తున్నప్పుడు, నేను బ్లింకిట్‌లో ఈ సందేశాన్ని చూశాను: "మీ ఆర్డర్ ఆసుపత్రి నుంచి వచ్చినదని గమనించాము. మీకు, మీ ప్రియమైన వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు పంపుతున్నాము. త్వరగా కోలుకోవాలని కోరుతున్నాము". వేలాది మంది కస్టమర్‌లకు సర్వీసు అందించే వారికి ఇది చాలా చిన్న విషయం, వారు విస్మరించవచ్చు. అయితే కొన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉన్న వారి మానసిక స్థితిని ఇది మెరుగుపరుస్తుంది. కంపెనీలు తమ వ్యాపారాన్ని దాటి తమ కస్టమర్‌ల పట్ల నిజమైన శ్రద్ధ చూపడం చాలా గొప్ప విషయం' అంటూ ఆ మెసేజ్ స్క్రీన్‌షాట్ షేర్ చేశారు.
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ పంపించిన శుభాకాంక్షలను అనేక మంది లింక్డ్ఇన్ వినియోగదారులు ప్రశంసించారు. తమకు కూడా గతంలో జరిగిన ఈ తరహా అనుభవాలను పంచుకున్నారు. భారతీయ కంపెనీలు నెమ్మదిగా మరింత కస్టమర్-సెంట్రిక్‌గా మారుతున్నాయి. జొమాటో, బ్లింకిట్ అటువంటి చర్యల్లో ముందుంటాయని పలువురు కామెంట్స్ చేశారు. ఇతర కంపెనీల నుంచి కూడా ఈ తరహా మంచి పద్ధతులను అనుసరించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications