Snap Layoffs: ప్రపంచ వ్యాప్తంగా టెక్, సోషల్ మీడియా రంగంలోని చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు పింక్ స్లిప్స్ అందిస్తున్నాయి. పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్న వేళ ఆర్థికంగా ఇబ్బందులను తగ్గించుకునేందుకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం స్నాప్‌చాప్ మాతృ సంస్థ స్నాప్ గ్లోబల్ ఫుల్-టైమ్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతం మందిని ఇంటికి పంపించాలనే ప్రణాళికలను వెల్లడించింది. దీనికి ముందు కంపెనీ 2022లో 20 శాతం మంది ఉద్యోగులను తగ్గించింది. అలాగే 2023లో కంపెనీ 3 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. 2023 ప్రారంభంలో కంపెనీలో దాదాపు 5,300 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అక్కడ స్థానిక చట్టాలకు అనుగుణంగా 2024 తొలి త్రైమాసిక కాలంలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టాలని చూస్తోంది. ఇందుకోసం భారీగానే నిధులు వెచ్చించాల్సి ఉంది.

వ్యూహాత్మకంగా కంపెనీకి కీలకమైన ప్రాధాన్యతలను సరైన రీతిలో అమలు చేయడం కోసం వ్యాపారాన్ని ఉంచడమే ఉద్యోగ కోతల వెనుక ఉన్న కారణంగా కంపెనీ ప్రకటించింది. భవిష్యత్ వృద్ధికి తోడ్పడే పెరుగుతున్న పెట్టుబడుల సామర్థ్యాన్ని నిర్ధారించడానికి కూడా ఈ చర్య ఉద్దేశించబడింది. వాస్తవానికి సోషల్ మీడియా దిగ్గజం యాడ్ ఆదాయాలు తగ్గటంతో తొలగింపులకు వెళ్లింది.
సోషల్ మీడియా సంస్థ ఉద్యోగుల హైరార్కీని తగ్గించేందుకు పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఒక ప్రతినిధి తెలిపారు. తాజా పరిణామాలతో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో కంపెనీ స్టాక్ ధర 3.1% తగ్గి 16.51 డాలర్లకు చేరుకుంది. కంపెనీ సోషల్ మీడియా వ్యాపారంలోని ఇతర పోటీదారులు మాదిరిగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించటం ద్వారా, ఇకపై ప్రాధాన్యత లేని ప్రాజెక్ట్‌లను తొలగించడం ద్వారా మాంద్యంతో కూడిన యాడ్ రెవెన్యూ తగ్గుదలను భర్తీ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
ఇటీవల తన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సోషల్ మీడియా దిగ్గజం మెటా నాలుగో త్రైమాసికం అమ్మకాల్లో 25 శాతం లాభాన్ని పొందటంతో స్టాక్ తిరిగి పుంజుకుంది. మెటా దాదాపు రెండేళ్లలో దాని అతిపెద్ద త్రైమాసిక పెరుగుదలను ఇటీవల అందుకుంది. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ పెరిగి ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications