వంటనూనెల ధరల కట్టడి నిమిత్తం వాటి నిల్వలపై విధించిన పరిమితులను రాష్ట్రాలు తప్పకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా సరఫరా, వాణిజ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధరలు కట్టడిలో ఉంటాయని పేర్కొంది. వంట నూనెలు, నూనె గింజల నిల్వల పైన గత ఏడాది అక్టోబర్ నెలలో కేంద్రం మార్చి 31, 2022 వరకు పరిమితి విధించింది. ఆ గడువును ఆ తర్వాత జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ వారం రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.
ద్రవ్యోల్భణాన్ని నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కూరగాయలు, నూనెల ధరలు పెరుగుదల భారీ షాక్. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే ఎడిబుల్ ఆయిల్ అయిన పామాయిల్ ధరలు ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో పదిహేను శాతం పెరిగాయి. సోయాబీన్ ఆయిల్ ధరలు 12 శాతం పెరిగాయి. ఇది ప్రపంచ ఆహార ద్రవ్యోల్భణం ఆల్ టైమ్ గరిష్టానికి దోహదం చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు ఎలా ఉన్నాయి, అవి దేశీయ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో కూడా వివరించినట్లు తెలిపింది. రిటైలర్లు 30 క్వింటాళ్లు, హోల్ సేలర్లు 500 క్వింటాళ్లు, రిటైల్ ఔట్ లెట్లు, భారీ వినియోగదారులు 30 క్వింటాళ్ల వరకు మాత్రమే నిల్వ చేసుకోవడానికి కేంద్రం అనుమతించింది. లాంగ్ చైన్ రిటైలర్స్, దుకాణదారులు వంద క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చునని తెలిపింది. వంట నూనెలను ప్రాసెస్ చేసేవారు గరిష్టంగా మూడు నెలల వరకు మాత్రమే నిల్వలను మెయింటైన్ చేయాలని తెలిపింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications