దేశంలో అత్యధిక జీతం పొందే CEO ఈయనే.. రోజుకి ఎన్ని లక్షలు సంపాదిస్తారో తెలిస్తే..
ఎన్నో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీలు భారతీయులు సమర్థవంతంగా నడిపిస్తున్నారు. CEOగా ఆయా సంస్థలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన వారు ఎందరో ఉన్నారు. వారి కృషికి తగినట్లే వారి జీతభత్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఇండియాలో అత్యధిక వేతనం పొందుతున్న CEO ఎవరో తెలుసా..?
దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు నిర్వహించే ప్రముఖ వ్యాపార సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో(L&T). సంస్థ మార్కెట్ విలువ 3.72 లక్షల కోట్లకు పైమాటే. ఆ కంపెనీ CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్ శేఖరిపురం నారాయణన్ సుబ్రహ్మణ్యన్. ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతను చేపట్టడంతో.. ఆయన ఇండియాలో అత్యధిక జీతం తీసుకుంటున్న CEOగా రికార్డు సృష్టించారు.

గత ఆర్థిక సంవత్సరంలో సుబ్రహ్మణ్యన్ వేతనం 61.27 కోట్లు. అంటే రోజుకి దాదాపు 16.70 లక్షలన్నమాట. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆయన వేతనం 115 శాతం పెరిగడంతో ఈ ఫీట్ సాధించారు. జూలై 1 2017న కంపెనీ CEO బాధ్యతలు చేపట్టారు. LTI, L&T టెక్నాలజీ సర్వీసెస్ రెండు బోర్డుల్లోనూ సభ్యులే. అదనంగా NSC ఛైర్మన్ గానూ కొనసాగుతున్నారు.
ఆయన L&T ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ మరియు ఛైర్మన్‌గా, L&T మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఛైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు. కంపెనీకి MD కాకముందు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ డిప్యూటీ MDగా, ప్లానింగ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించారు. బెంగుళూరులో విమానాశ్రయం, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు. 2021లో కన్‌స్ట్రక్షన్ వీక్ పవర్ 100 ర్యాంకింగ్‌లో 11వ స్థానంలో నిలిచారు.

SN సుబ్రహ్మణ్యన్ చెన్నైకి చెందినవారు. ప్రస్తుతం NIIT కురుక్షేత్ర కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. తరువాత పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో MBA పూర్తి చేశారు. ప్రసిద్ధ లండన్ బిజినెస్ స్కూల్‌లోనూ సీనియర్ మేనేజ్‌మెంట్‌లో విద్యను అభ్యసించారు.


Click it and Unblock the Notifications