ప్రీమియం ఫోన్ల స్మగ్లింగ్... సర్కారు ఖజానాకు ఎంత నష్టమంటే?

దేశంలో అమ్ముడవుతున్న వస్తుసేవలపై ప్రభుత్వం పన్ను విదిస్తుంది. ఈ పన్ను ఒక్కో దానిపై ఒక్కో విధంగా ఉంటుంది. పన్ను ద్వారా సమకూరే రాబడిని ప్రభుత్వం అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఖర్చు చేస్తుంది. అయితే వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత కొన్నింటి పై పన్నులు పెరిగాయి. ఈ పన్నును చెల్లించకుండా ఉండటానికి అనేక మంది అనేక దొడ్డి దారులు వెతుకుతున్నారు. పన్నులు ఎగవేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చే సొమ్ము తగ్గిపోతోంది.

విస్తరిస్తున్న స్మగ్లింగ్ వ్యాపారం...

విస్తరిస్తున్న స్మగ్లింగ్ వ్యాపారం...

* విదేశాల్లో కొన్ని ఉత్పత్తులు తక్కువ ధరకు దొరుకుతాయి. అవే ఉత్పత్తులకు మన దేశంలో ఎక్కువ ధర ఉంటుంది. ఇలాంటి ఉత్పత్తులను విదేశాలనుంచి దొడ్డిదారి గుండా మనదేశంలోకి వచ్చి కాస్త తక్కువ మొత్తానికి అమ్ముతుంటారు. విదేశాల నుంచి తెచ్చినప్పుడు వాటికి కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎగవేసేందుకు చాలా మంది స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. ఇలా బంగారాన్ని తెస్తూ చాలా మంది దొరికి పోతున్నారు...

* అయితే ఇప్పుడు ఈ దందా ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు పాకుతోంది. యాపిల్, శాంసంగ్, ఇతర కంపెనీలకు చెందిన ప్రీమియం ఫోన్లలో ఈ దందా సాగుతోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు వార్షికంగా 2,400 కోట్ల మేరకు గండి పడుతోందట. 50,000 రూపాయలకు మించిన ధర కలిగిన ఫోన్ల ను లక్ష్యంగా చేసుకొనే ఈ వ్యవహారం

* కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు కు ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అందజేసిన సమాచారం ప్రకారం అనధికారిక మార్కెట్ 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఇందులో 8,000 కోట్ల రూపాయల వరకు మొబైల్ ఫోన్ విభాగం ఉంటుందట. మొబైల్ ఫోన్ల మొత్తం అమ్మకాల్లో దీని వాటా 7.2 శాతం ఉంటుందని సమాచారం. ఈ స్థాయిలో స్మగ్లింగ్ జరగడం వల్ల ప్రభుత్వం వార్షికంగా 2,400 కోట్ల రూపాయల రాబడిని కోల్పోతోందని చెబుతున్నారు. వస్తుసేవల పన్నుతో పాటు కస్టమ్ సుంకం చెల్లించక పోవడం వల్ల ఈ మేరకు నష్టం వాటిల్లుతోందని సమాచారం.

సుంకాలు ఎందుకంటే...

సుంకాలు ఎందుకంటే...

* మేక్ ఇన్ ఇండియాకు మన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విదేశాల నుంచి మన దేశానికి వచ్చే అనేక రకాల ఉత్పత్తులపై పన్నులు విధిస్తోంది. దీని వల్ల దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అప్పుడు వినియోగదారులు దేశీయంగానే ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే విదేశాలనుంచి పన్నులు చెల్లించకుండా తీసుకువచ్చే వాటి ధర తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని కొనే వారు పెరుగుతుండటం వల్లనే దొడ్డిదారిలో మన దేశంలోని మొబైల్ ఫోన్లు వంటివి వస్తున్నాయి.

సులభంగా తీసుకురావచ్చు...

సులభంగా తీసుకురావచ్చు...

* ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు లేదా పెద్ద పరిమాణంలో ఉండే ఉత్పత్తులు స్మగ్లింగ్ చేయడం కష్టమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొబైల్ ఫోన్లు వంటి వాటిని సులభంగా విదేశాల నుంచి తీసుకు రావొచ్చని అందుకే వీటిని మార్కెట్లోకి ఎక్కువగా తెస్తున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. విదేశాల నుంచి తెచ్చిన ఫోన్లు మనదేశంలో తక్కువ ధరకు అమ్ముతున్నారని, వీటిని కొనుగోలు చేసేందుకు కొంత మంది ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+