చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO ోబుధవారం కీలక ప్రకటన చేసింది. క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు తెలిపింది. క్రికెటర్లలో కోహ్లీ, ధోనీ, సచిన్, రోహిత్ శర్మ, సినిమా తారల్లో అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ తదితరులకు మంచి డిమాండ్ ఉంది. పదుల కొద్ది బ్రాండ్లకు వీరు అంబాసిడర్‌గా ఉన్నారు. వీరందరిలోకెల్లా కోహ్లీ మండి డిమాండ్‌లో ఉన్నారు.

యువతకు చేరువయ్యేలా కోహ్లీ
చైనాలో వివోకు iQOO సబ్ బ్రాండ్‌గా ఉంది. ఇప్పుడు ఇది భారత్‌లోకి ప్రత్యేకంగా ఎంటర్ అవుతోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీకి యువతను చేరువ చేసేందుకు కోహ్లీ నియామకం ఉపయోగపడుతుందని తెలిపింది.

కోహ్లీ సరిగ్గా సరిపోతాడు
తమ కంపెనీకి విరాట్ కోహ్లీ సరిపోతాడని కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్) గగన్ అరోరా అన్నారు. అతను తమతో కలిసి పని చేయడం పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పారు. ప్రీమియం విభాగంలో హై పర్ఫార్మెన్స్, ఆవిష్కరణ, భిన్నమైన ఉత్పత్తులను తాము విరాట్ కోహ్లీ ద్వారా ప్రచారం చేస్తామన్నారు.

టార్గెట్ ఐపీఎల్..
ఆధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్స్ ద్వారా మొబైల్ మార్కెట్లో iQOO మంచి పేరు సంపాదించుకుందని విరాట్ కోహ్లీ అన్నారు. కాగా, ఇప్పటికే ఈ కంపెనీ విడుదల చేసిన టీజర్‌లలో కోహ్లీ కనిపిస్తున్నారు. పూర్తి ప్రచారం స్మార్ట్ ఫోన్ మోడల్ iQOO 3ని ఫిబ్రవరి 25న లాంచ్ చేసిన సమయంలో ప్రారంభమవుతుంది. ఐపీఎల్ సీజన్‌లో ఈ ప్రకటనలు మన ముందుకు ఆకర్షణీయంగా రానున్నాయి.

25న 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్
భారత్‌లోకి ప్రత్యేకంగా అడుగు పెడుతోన్న iQOO ఫిబ్రవరి 25న 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇది అభివృద్ధి చెందుతున్న ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ల మార్కెట్లో పోటీ పడనుంది. తొలుత ఐ క్వెస్ట్ ఆన్ అండ్ ఆన్ ద్వారా ఆన్ లైన్ సేల్స్ ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి అడుగు పెట్టే ప్రయత్నం చేయనుంది.

పది లక్షల ఫోన్ల విక్రయం టార్గెట్
రానున్న ఏడాదిలో 10 లక్షల ఫోన్లను విక్రయించాలని భావిస్తోంది. బీబీకే గ్రూప్ నుంచి ఐక్యూ ఐదో సంస్థగా భారత్‌లో అడుగు పెడుతోంది. ఇప్పటికే ఈ మాతృ సంస్థ నుంచి వన్ ప్లస్, వివో, ఒప్పో, రియల్ మి బ్రాండ్స్ వచ్చాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications