Investment Tips: పెట్టుబడులు పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
పెట్టుబడిదారులు గరిష్ఠ రాబడి రావాలనే ఆలోచిస్తారు.అలాంటి వారు కచ్చితమైన ప్రణాళికతో పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ సాధించవచ్చు. ముందుగా మీ నష్టభయం భరించే సామర్థ్యాన్ని బట్టి, పెట్టుబడి పథకాలను ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలిక రక్షణ కోసం.. దీర్ఘకాలంలో వచ్చే లాభాలను వదులుకోకుండా చూసుకోవాలి. మీ పెట్టుబడుల జాబితాను సమీక్షించుకునేటప్పుడు దీర్ఘకాలంలో పెట్టుబడి రాబడిని మనసులో పెట్టుకోవాలి. అన్ని పెట్టుబడి పథకాలు ఒకే సమయంలో ఒకే రీతిలో ప్రవర్తించవు అనేది కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
మీ ఆర్థిక లక్ష్యాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. పెట్టుబడులను సమీక్షించుకోవాలి. అవి మీ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాయా లేదో పరిశీలించుకోవాలి. సరిగా రాబడి ఇవ్వని పథకాల్లో పెట్టుబడులు ఆపాలి. పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండటంతోపాటు, సమతౌల్యంగానూ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో అవి సరిగానే పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. మార్కెట్ పరిస్థితులు బాగాలేక.. పెట్టుబడులు కొంచెం ప్రతికూలంగా ఉంటే ఆందోళన చెందనక్కర్లేదు.

పెట్టుబడి పథకాలు మన లక్ష్యాలకు తగ్గట్టుగా.. అన్ని రకాల నష్టభయాలను తట్టుకునేలా ఉండాలి. డెట్ మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, స్థిరాస్తి ఇలా.. అనేక విధాలుగా మీ పెట్టుబడులను కేటాయించాలి. అప్పుడే వాటి వల్ల వచ్చే ప్రతిఫలాలు ఆకర్షణీయంగా ఉండే ఆవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications