Smart Business Idea: మన దేశంలో దీపావళి ఉత్సవాలు మొదలయ్యాయి. మార్కెట్లు ఇప్పుడు రంగురంగుల కాంతులతో మెరుస్తున్నాయి, ప్రతి ఇంటిలో ఆనంద వాతావరణం నిండిపోయింది. ఈ పండుగ కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇప్పుడు ఓ సువర్ణావకాశం. ఎందుకంటే, దీపాల పండుగ అంటే కేవలం లైట్లు మాత్రమే కాదు. కొవ్వొత్తుల కోసం కూడా పెద్ద డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు కూడా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను సాధించాలనుకుంటే, కొవ్వొత్తుల తయారీ వ్యాపారం మీకు సరైన మార్గం అవుతుంది. కేవలం రూ. 10 వేల పెట్టుబడితో మీరు ఈ వ్యాపారాన్ని మీ ఇంటి నుంచే మొదలుపెట్టవచ్చు!
దీపావళి సమయంలో కొవ్వొత్తుల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. అయితే ఇది కేవలం పండుగలకే పరిమితం కాదు. పుట్టినరోజులు, వివాహాలు, మతపరమైన వేడుకలు, హోటల్స్, స్పా సెంటర్లు.. ఇప్పుడు ఎక్కడ చూసినా కొవ్వొత్తుల వినియోగం పెరుగుతోంది. ఇంటి అలంకరణ కోసం సువాసనగల, డిజైనర్ కొవ్వొత్తులకు పెద్ద మార్కెట్ ఉంది. ఇపుడు ఇవి కేవలం చిన్న దుకాణాలలోనే కాదు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అమ్ముడవుతున్నాయి.

మీరు చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించాలంటే? : ఈ వ్యాపారం కోసం పెద్ద యంత్రాలు లేదా భారీ పెట్టుబడి అవసరం లేదు. మోల్డ్‌లు (Moulds) కొనుగోలు చేయడం (వివిధ ఆకారాలు, డిజైన్‌లలో లభిస్తాయి). అలాగే వెక్స్ (Wax), విక్ (Wick), రంగులు, సువాసన నూనెలు (Fragrance Oils)వంటి పదార్థాలు సిద్ధం చేసుకోవడం..వీటిని కూడా మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో సులభంగా పొందవచ్చు కేవలం రూ. 10 వేల నుంచి రూ. 15 వేల పెట్టుబడితో మీరు ఇంటి చిన్న మూలలో నుంచే కొవ్వొత్తుల తయారీ మొదలు పెట్టవచ్చు.
డిమాండ్ పెరిగిన తర్వాత వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి? : మీ ఉత్పత్తికి మార్కెట్‌లో స్పందన వచ్చిన తర్వాత సెమీ ఆటోమేటిక్ లేదా ఆటోమేటిక్ మెషిన్ కొనుగోలు చేయవచ్చు.
మాన్యువల్ మెషిన్: గంటకు సుమారు 1800 కొవ్వొత్తులు
ఆటోమేటిక్ మెషిన్: నిమిషానికి 200 కొవ్వొత్తులు తయారు చేస్తుంది
వీటి ధర సుమారు రూ. 35 వేల వరకు ఉంటుంది
డిమాండ్ పెరిగినకొద్దీ మీరు డిజైనర్, కలర్‌ఫుల్, సువాసనగల కొవ్వొత్తులు తయారు చేసి మీ స్వంత బ్రాండ్ పేరుతో అమ్మకాలు సాగించవచ్చు.
లాభం ఎలా వస్తుంది? మీరు 100 సాధారణ కొవ్వొత్తులు తయారు చేస్తే, మొత్తం ఖర్చు (వెక్స్, విక్, రంగు, ప్యాకింగ్ కలిపి) సుమారు రూ. 500 అవుతుంది. మార్కెట్‌లో ప్రతి కొవ్వొత్తిని రూ. 10కి అమ్మితే, మీరు రూ. 1,000 సంపాదిస్తారు. అంటే మీకు 50 శాతం లాభం వస్తుంది. ఇప్పుడు మీరు డెకరేటివ్ లేదా సువాసనగల కొవ్వొత్తులు తయారు చేస్తే..వీటిని మార్కెట్‌లో రూ. 50 నుంచి రూ. 200 వరకు అమ్ముకోవచ్చు.అవి తయారు చేయడానికి ఖర్చు కేవలం రూ. 15-రూ. 50 మాత్రమే. అంటే మీరు 100 శాతం నుండి 300 శాతం వరకు లాభం పొందవచ్చు.
వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రభుత్వ సాయం కూడా ఉంది. మీరు మీ వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో విస్తరించాలనుకుంటే ప్రధానమంత్రి ముద్రా యోజన లేదా ఇతర స్మాల్ బిజినెస్ లోన్స్ ద్వారా సహాయం పొందవచ్చు. ఇలా మీరు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించవచ్చు. దీపావళి సమయంలో ప్రతి దుకాణంలో కొవ్వొత్తులు అమ్ముడవుతున్నాయి. మీరు స్థానిక మార్కెట్లలో డైరెక్ట్ సేల్స్ చేయవచ్చు లేదా మీ బ్రాండ్ పేరుతో ఆన్‌లైన్ అమ్మకాలు ప్రారంభించవచ్చు.
Amazon, Flipkart, Meesho వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో రిజిస్టర్ అవ్వండి. సోషల్ మీడియాలో మీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయండి. టోకు వ్యాపారులతో భాగస్వామ్యం చేయండి. ఇలా మీరు క్రమంగా లక్షల రూపాయల ఆదాయం సంపాదించవచ్చు. ఇది కేవలం పండుగలకే కాదు, సంవత్సరమంతా డిమాండ్ ఉండే వ్యాపారం కాబట్టి ఇంటి నుంచే వెలిగే ఈ చిన్న కాంతి.. మీ జీవితాన్నే వెలిగించగలదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications