Small Saving Schemes: దేశంలో చాలా మంది చిన్న పొదుపు పథకాల్లో తమ డబ్బును పార్క్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారని మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వీటికి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వీటి మధ్య ప్రస్తుతం మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెడుతున్నట్లయితే ఈ వార్త మీకోసమే. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసిక కాలానికి ఇటువంటి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెరుగుతాయని వినిపిస్తోంది. అయితే వడ్డీ రేట్లను జూన్ చివరి వారంలో సమీక్షిస్తుంది ప్రభుత్వం.

మెుదటి త్రైమాసికం అంటే.. ఏప్రిల్ 1, 2024 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమైన త్రైమాసికానికి వివిధ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎటువంటి మార్పు చేయలేదని మనందరికీ తెలిసిందే. అందువల్ల రానున్న రెండవ త్రైమాసికంలో కొన్ని పథకాల వడ్డీ రేట్లలో మార్పులను పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం వివిధ చిన్న పొదుపు పథకాలకు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను గమనిస్తే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.1 శాతం, సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ, మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ అందుబాటులో ఉన్నాయి. అలాగే 115 నెలల్లో మెచ్యూర్ అయ్యే కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతం వడ్డీ చెల్లించబడుతోంది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2024 వరకు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్‌పై వడ్డీ రేటు 7.7 శాతంగా ఉండగా.. నెలవారీ ఆదాయ పథకం వడ్డీ రేటు ప్రస్తుత త్రైమాసికంలో 7.4 శాతంగా కొనసాగుతున్నాయి.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుపై నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ వరుసగా 8వ సారి సైతం రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. కీలక వడ్డీ రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ఈ సారి సైతం ఎంపీసీ ప్యానెల్ నిర్ణయించింది.
రెపో అనేది వాణిజ్య బ్యాంకులు తమ తక్షణ అవసరాలను తీర్చడానికి సెంట్రల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకునే వడ్డీ రేటు. అయితే ఎన్నికలు పూర్తైన తర్వాత కేంద్రంలో కొలువుదీరిన ప్రభుత్వం చిన్న పొదుపు స్కీమ్స్ పై ఈ సారి వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రకటన వచ్చేంతవరకు చాలా మంది కొత్త పెట్టుబడులను తాత్కాలికంగా ఆపాలని చూస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications