Bengaluru Housing Crisis: బెంగళూరు అనగానే మరకు మరో మినీ ఇండియా లాంటిది. ఎందుకంటే దేశంలో ఐటీ, స్టార్టప్ పరిశ్రమ ఇక్కడ భారీగా విస్తరించిన వేళ కోట్ల మంది ఈ నగరానికి ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వస్తుంటారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగానే ఐటీ ఉద్యోగులు నగరాన్ని ముంచెత్తారు.
ఈ పరిస్థితులతో నగరం కిక్కిరిసిపోతోంది. జనాభాకు అవసరమైన స్థాయిలో ఇళ్లు అద్దెకు అందుబాటులో లేకపోవటం అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. రెండు పడక గదులు కలిగిన ఇళ్లకు కనీసం రూ.50 వేల నుంచి రూ.90 వేల మధ్య అద్దె డిమాండ్ చేస్తున్నారు బెంగళూరులోని యజమానులు. అంటే ఆదాయంలో దాదాపు సగం కేవలం ఇంటి అద్దె కోసం చెల్లించాల్సి రావటంపై పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బెంగళూరులో దిగజారిన పరిస్థితులకు అద్దం పట్టే వీడియో ఒకదాన్ని వ్యక్తి పంచుకున్నాడు.
బెంగళూరులోని అద్దెలకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోను పరిశీలిస్తే.. కేవలం ఒక క్లాసెట్ పరిమాణంలో ఉన్న ఒక బెట్ రూం ఇంటి అద్దె ఏకంగా రూ.25,000 చెల్లిస్తున్నట్లు వ్యక్తి పంచుకున్న వీడియో పెద్ద సంచలనంగా మారిపోయింది. ఇందులో సదరు వ్యక్తి రెండు చేతులను చాపగా రూముకు రెండు వైపులా ఉన్న గోడ తగలటం గది ఎంత చిన్నగా ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇక పోతే వీడియోలో బాల్కనీని పరిశీలిస్తే ఒక వ్యక్తి ప్రశాంతంగా నిలబడటానికి సైతం చోటు సరిపోదని అర్థమౌతోంది.

అయితే ఇంత చిన్న గదిని అద్దెకు తీసుకున్న వ్యక్తి హాస్యాస్పదంగా స్పందిస్తూ.. ఇలాంటి చిన్న గది ఇంటి వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని వెల్లడించాడు. ఇలాంటి ఇంట్లో నివసించే వ్యక్తులు కొత్తగా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయరని, డబ్బులు కూడా ఆదా అవుతాయని అభిషేక్ పేర్కొన్నాడు. కేవలం ఒక్క మనిషి పట్టే ఇలాంటి చిన్న గదికి రూ.25,000 అద్దె వసూలు చేయటంపై సోషల్ మీడియా తీవ్రంగా స్పందిస్తోంది. కేవలం కొన్ని గంటల్లోనే వీడియా వైరల్ అయ్యింది. చాలా మంది ఆ గది తమ బాత్‌రూమ్ కంటే చిన్నగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని చిన్న ఇరుకైన ఇళ్ల మాదిరిగా బెంగళూరులోని పరిస్థితులు మారిపోయాయని మరికొందరు భావిస్తున్నారు. బెంగళూరులో విపరీతంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవటంపై కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించకపోవటం, సరైన చర్యలు చేపట్టకపోవటం ఇతర నగరాల నుంచి అక్కడికి వచ్చే వారికి ఇబ్బందిగా మారుతోందని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు టెక్కీలు బెంగళూరు కంటే హైదరాబాదులో ఉద్యోగం బెటర్ అని భావిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు బ్యాచిలర్లకు ఈ చిన్న ఇల్లు స్వర్గం లాంటిదని అంటున్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Trending: యూపీలో వింత ఘటన.. సామాన్యురాలి ఖాతాలోకి రూ. 10 కోట్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications