ఒక వినియోగదారు ఉత్పత్తిని తయారు చేయడం ఒక ఎత్తు... దాన్ని అమ్ముకోవడం మరో ఎత్తు. ఎక్కడో తయారైన ప్రోడక్ట్ ను కస్టమర్ల చెంతకు చేర్చి దాన్ని కొనే విధంగా చేయడం అంత సులభం ఏమీ కాదు. వినియోగదారులు తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు కంపెనీలు నానా ప్రయత్నాలు చేస్తుంటాయి. పెద్ద ఎత్తున టీవీలు, ఎఫ్ ఎం రేడియోల ద్వారా ప్రకటనలు చేస్తాయి. హోర్డింగ్ లను ఏర్పాటు చేస్తాయి. పత్రికల్లో ప్రకటన చేస్తాయి. ఈ పని నిరంతరం జరుగుతుంది. అప్పుడే కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకొని మార్కెట్లో నిలబడగలుగుతాయి. లేకపోతే పోటీలో కొట్టుకు పోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కంపెనీలు అన్ని రకాల కస్టమర్లను చేరువ అయ్యేందుకు శ్రమిస్తున్నాయి. చిన్న, పెద్ద కస్టమర్లు అని చూడకుండా వారికి నచ్చిన విధంగా తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. అమ్మకాలను పెంచుకుంటున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో...
* అన్ని ఉత్పత్తులకు డిమాండ్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఒకప్పుడు కంపెనీలు తెచ్చే పెద్ద పెద్ద ఫ్యాక్ లను కొనుగోలు చేసే కస్టమర్లు తర్వాతి కాలంలో వాటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడక పోవచ్చు. ధరలు అధికంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం కావొచ్చు. కొంత మంది పెద్ద ప్యాక్ ను కొనుగోలు చేసినా దాన్ని పూర్తిగా వినియోగించే వరకు కొంత పడయి పోవచ్చు. అప్పుడు వాటిని కొనుగోలు చేసే వారు తగ్గి పోతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు తక్కువ పరిమాణం ఉండే ఉత్పత్తులను తెస్తున్నాయి.
* సబ్బులు, షాంపూలు, పేస్టులు, ఆహార పదార్థాలు వంటివి ఇప్పుడు ఏ దుకాణంలో చూసినా పెద్ద మొత్తంలో కనిపిస్తున్నాయి. వీటి ద్వారా అన్ని రకాల కస్టమర్లను ఆకర్షించి అమ్మకాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కంపెనీలు.
* ఆర్ధిక మందగమనం నేపథ్యంలో విభిన్న రకాల కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి. అందుకే అన్ని కంపెనీలు ఇలా చిన్న ప్యాకుల ద్వారా అమ్మకాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాలు కీలకం
* త్వరిత గతిన అమ్ముడయ్యే ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీలకు గ్రామీణ మార్కెట్లే కీలకంగా మారుతున్నాయి. మందగమనం నేపథ్యంలో ఈ మార్కెట్లలో అమ్మకాలు బాగా ప్రభావితం అవుతున్నాయి. అందుకే చిన్న ప్యాకుల ద్వారా ఇలాంటి కష్టమర్లను ప్రసన్నం చేసుకోవడానికి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
* నగరాల్లోని కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని తెచ్చిన చిరుతిళ్లను కూడా చిన్న ప్యాక్లలో అందిస్తున్నాయి.
* చిన్న ప్యాక్ ల ద్వా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అమ్మకాలు 15 శాతం వరకు పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
* చిన్న ప్యాక్లను తీసుకురావడం వల్ల ఖరీదుగా ఉండే ఉత్పత్తులను కూడా పల్లె ప్రజలు కొనుగోలు చేస్తున్నారట.
* తక్కువ ధర ఉండటం వల్ల కొత్త రకం ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
* చిన్న కంపెనీలే కాకుండా పెద్ద కంపెనీలు కూడా చిన్న ప్యాక్ లను తీసుకువస్తున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications