High FD Rate: 9.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్.. ఇక్కడ డబ్బు డిపాజిట్ చేసుకోండి
High FD Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే సీనియర్ సిటిజన్‌లకు సూపర్ వడ్డీ రేట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, కొత్త తరం ప్రైవేటు బ్యాంకులు అత్యధికంగా 9.1 శాతం వరకు వడ్డీని చెల్లిస్తున్నాయి.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల FDలపై 9.1 శాతం వడ్డీని అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇది ఉత్తమ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. లక్ష పెట్టుబడిని మూడేళ్లలో రూ.1.31 లక్షలకు పెరుగుతుంది.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల FDలపై 8.85 శాతం వడ్డీని అందిస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తాన్ని మూడేళ్ల కాలంలో రూ.1.30 లక్షలు చేస్తుంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం మూడేళ్ల FDలపై 8.60 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడేళ్ల కాలంలో రూ.1.29 లక్షలకు చేరుకుంటుంది.
DCB బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల FDలపై 8.50 శాతం వడ్డీని అందిస్తుంది. ఇది ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉత్తమ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్షను మూడేళ్లలో రూ.1.29 లక్షలుగా మారుస్తుంది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం మూడేళ్ల FDలపై 8 శాతం వడ్డీని, SBM బ్యాంక్ ఇండియా సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల FDలపై 7.8 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల FDలపై 7.55 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications