High Interest FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.60% వరకు వడ్డీ.. 5 ఉత్తమ ఎంపికలు ఇవే..
Fixed Deposit: దేశంలోని ప్రజలు ఇప్పటికీ తక్కువ వడ్డీ వచ్చినప్పటికీ బ్యాంకుల్లో తమ డబ్బును డిపాజిట్లు చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే కొందరు తెలివైన పెట్టుబడిదారులు మాత్రం దీనికి విరుద్ధంగా అధిక వడ్డీ రాబడిని పొందేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డబ్బును FD చేసి బంపర్ రిటర్న్స్ పొందుతున్నారు. వీటిలో పెట్టుబడిపై గరిష్ఠంగా 9.6 శాతం వరకు వడ్డీని వారు పొందుతున్నారు.
1. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:
మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 9.10% వడ్డీని ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అత్యధికంగా 9.60% వడ్డీని 5 సంవత్సరాల కాలానికి అందిస్తోంది.

2. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1001 రోజుల FDపై 9% వడ్డీని అందిస్తుండగా.. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.50% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.
3. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1000 రోజుల FDపై 8.51% వడ్డీని చెల్లిస్తుండగా.. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.11% వడ్డీని అందిస్తోంది.
4. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెగ్యులర్ కస్టమర్లకు 888 రోజుల FDపై 8.50% వడ్డీని ఇస్తోంది. అదే కాలానికి సీనియర్ సిటిజన్ కస్టమర్లకు మాత్రం 9% వడ్డీని అందిస్తోంది.
5. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్‌లకు 2-3 సంవత్సరాల లోపు FDపై 8.50% వడ్డీని అందజేస్తోంది. అదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9% వడ్డీని చెల్లిస్తోంది.


Click it and Unblock the Notifications