Small Cap: లాభాల్లో స్మాల్ క్యాప్ స్టాక్స్.. ఏది ఎంత పెరిగిందంటే..

ఏప్రిల్ నుంచి నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు ఆగస్టులో గడిన పడ్డాయి. ఆగస్టులో ఇప్పటివరకు రెండు సూచీలు 3.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఈ వారం మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. అయితే శుక్రవారం జరిగిన కరెక్షన్ లాభాలను తగ్గించింది.బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, బీఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు, బిఎస్‌ఇ-30, నిఫ్టీ-50 ఇండెక్స్‌లను అధిగమించాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.

రూ. 3,128.96 కోట్లు

రూ. 3,128.96 కోట్లు

చమురు ధరలు తగ్గడం, Q1FY23 ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం, విదేశీ ఫండ్ ఫ్లోలు కూడా అనుకూలంగా మారడంతో మార్కెట్ సెంటిమెంట్‌ పెరిగిందని శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) వారంలో రూ. 3,128.96 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) 1,808.89 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం

స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం

స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, మిడ్ క్యాప్ 0.81, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం లాభపడ్డాయి. సెక్టోరల్‌లో బీఎస్‌ఈ పవర్ 3 శాతం, టెలికాం 2 శాతం, బీఎస్‌ఈ క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.8 శాతం పెరిగాయి. కమోడిటీలు ఒత్తిడిలో కొనసాగుతున్నందున BSE మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం పడిపోయింది.

FIIలు

FIIలు

ఆగస్టులో, ఇప్పటివరకు, FIIలు రూ. 17,970.62-కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.DIIలు రూ. 6,052.67 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఫోర్బ్స్ గోకాక్, రెప్కో హోమ్ ఫైనాన్స్, DFM ఫుడ్స్, సంఘీ ఇండస్ట్రీస్, రానే హోల్డింగ్స్, NAVA బిల్డింగ్స్, సహా 50 కంటే ఎక్కువ స్మాల్‌క్యాప్‌ స్టాక్ లు మంచి వృద్ధిని నమోదు చేశాయి. యారీ డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, బ్రైట్‌కామ్ గ్రూప్, జూబిలెంట్ ఇండస్ట్రీస్ అండ్ బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా) 10-61 శాతం పెరిగాయి.

బీఎస్ఈ 500 ఇండెక్స్

బీఎస్ఈ 500 ఇండెక్స్

మరోవైపు, నవ్‌కర్ కార్పొరేషన్, వోల్టాంప్ ట్రాన్స్‌ఫార్మర్స్, హిమత్‌సింకా సెయిడ్, గాయత్రీ ప్రాజెక్ట్స్, జాగ్రన్ ప్రకాశన్, టీసీఎన్ఎస్ క్లోతింగ్ కో, డీబీ రియాల్టీ, ఐనాక్స్ లీజర్, పీవీఆర్ 10-20 శాతం మధ్య నష్టపోయాయి. బ్రైట్‌కామ్ గ్రూప్ మద్దతుతో బీఎస్ఈ 500 ఇండెక్స్ 0.7 శాతం పెరిగింది. హికాల్, అదానీ పవర్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, వోకార్డ్ట్, మిశ్రా ధాతు నిగమ్ వృద్ధి నమోదు చేసింది.

Note: ఈ వార్త కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+